ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భగ్గుమంటున్న చమురు ధరలు

*బ్యారెల్ ముడి చమురుపై 5 డాలర్ల మేర పెంపు, తాజా ధర 108.60 *భారత్‌లోనూ త్వరలో పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్

Update: 2022-03-02 11:15 GMT

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భగ్గుమంటున్న చమురు ధరలు

Crude Oil Prices: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీదా పడనుంది. ప్రస్తుతం ఎన్నికల కారణంగా స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు త్వరలోనే రికార్డు స్థాయిలో పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్యారెల్ ముడిచమురుపై 5 డాలర్ల మేర పెరిగింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ ప్రకారం బెంచ్ మార్క్ యూఎల్ క్రూడ్ బ్యారెల్ ధర 5.24 డాలర్లు పెరిగి 108. 60 డాలర్లుకు చేరింది. ఇక భారత్‌లో 5.43 డాలర్లు ఎగబాకి 110.40 డాలర్లకు పెరిగింది. 

Tags:    

Similar News