Cement Prices Rise: సామాన్యులకు మరో ఎదురుదెబ్బ.. సిమెంట్ ధరల పెరుగుదల..!
Cement Prices Rise:సామాన్యులకు మరో ఎదురుదెబ్బ.. సిమెంట్ ధరల పెరుగుదల..!
Cement Prices Rise: ప్రముఖ సిమెంట్ కంపెనీ ఇండియా సిమెంట్ లిమిటెడ్ తన భూమిలో కొంత భాగాన్ని రుణ చెల్లింపు కోసం, మూలధన వ్యయం పెంచడం కోసం విక్రయించనుంది. అలాగే సిమెంట్‌పై బస్తాకు రూ.55 చొప్పున పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. బొగ్గు ధరల పెరుగుదల కారణంగా ధర పెరిగిందని దీంతో కంపెనీ ధరను పెంచాల్సి వచ్చిందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు చెబుతున్నారు.
జూన్ నుంచి జూలై మధ్య మూడు దశల్లో ఇండియా సిమెంట్ కంపెనీ సిమెంట్ ధరను మూడు దశల్లో రూ.55 చొప్పున పెంచనుంది. జూన్ ఒకటో తేదీన సిమెంట్ బస్తాపై రూ.20, జూన్ 15న రూ.15, జూలై 1న రూ.20 పెంచనుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ అప్పులు తీర్చడానికి, మూలధన వ్యయం కోసం కంపెనీ కొంత భూమిని అమ్ముతుందని చెప్పారు.
భయాందోళనలకు గురై భూమిని అమ్మడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో దాదాపు 26 వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూములు వివిధ వర్గాలకు చెందినవి. ధరపెంచకుంటే నష్టం జరుగుతుందని, ఇతర సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధర తగ్గించే ఆలోచనలో ఉన్నాయని శ్రీనివాసన్‌ను ప్రశ్నించగా.. పోల్చవద్దని తెలిపారు. అన్నింటి ధర పెరిగింది. ధర పెంచకపోతే చాలా నష్టపోతామని వాదించారు.