Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ..

Business Idea: ఈ రోజుల్లో ఉద్యోగాలు సాధించడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. కానీ స్వయం ఉపాధి పొందడం సులభంగా జరుగుతుంది.

Update: 2022-05-10 14:30 GMT

Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ..

Business Idea: ఈ రోజుల్లో ఉద్యోగాలు సాధించడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. కానీ స్వయం ఉపాధి పొందడం సులభంగా జరుగుతుంది. ఎందుకంటే దీనికోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరుచేస్తున్నాయి. ఈ రోజు ఒక వ్యాపారం గురించి తెలుసుకుందాం. దీని పేరు టెంట్ హౌజ్‌ వ్యాపారం. దీనిని ప్రారంభించడానికి మీకు కొంత స్థలం ఉంటే చాలు. ఇటీవల ఈ వ్యాపారం చాలా విస్తరించింది. ఎందుకంటే కరోనా తరువాత ప్రజలు ఇళ్లలో వివాహాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీని కోసం ఇంటి దగ్గరే టెంట్లు వేసుకోవడం, ఫర్నీచర్, వంట సామగ్రి అద్దెకి తీసుకుంటున్నారు. ఖర్చు తక్కువగా ఉంటుందని చాలామంది ఇంటిదగ్గరే ఫంక్షన్లు చేస్తున్నారు. దీంతో టెంట్ హౌజ్‌ వ్యాపారానికి డిమాండ్‌ పెరిగినట్లయింది.

టెంట్ ఏర్పాటుకు చెక్క స్తంభాలు లేదా వెదురు బొంగులు, లేదా ఇనుప పైపులు అవసరమవుతాయి. తరువాత కుర్చీలు, రగ్గులు, లైట్లు, ఫ్యాన్లు, దుప్పట్లు, బెడ్‌స్ప్రెడ్‌లు, అన్ని ఫంక్షన్లకి అవసరం కాబట్టి ఉండాలి. టెంట్ హౌస్ వ్యాపారం కోసం అలంకరణ వస్తువులు, ఆపై లైట్లు, పూల ఏర్పాట్లు, మ్యూజిక్ సిస్టమ్, క్యాటరింగ్ వస్తువులు ఉండాలి. గ్యాస్ స్టవ్, బిర్యాని వండటానికి గిన్నెలు, కర్నీ గిన్నెలు, వాటర్‌ డ్రమ్ములు ఉండాలి. ప్రారంభ దశలో మీరు 1 నుంచి 1.5 లక్షల రూపాయలతో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇది కాకుండా మీ వద్ద ఎక్కువగా డబ్బులుంటే వ్యాపారాన్ని క్రమంగా విస్తరించవచ్చు. 4 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని బాగా పెంచుకోవచ్చు.

పెళ్లిళ్ల సీజన్‌లో చిన్న బుకింగ్‌లు లేదా పెద్ద బుకింగ్‌లు ఉంటాయి. మీరు ఒక్క ఆర్డర్‌తో 25 వేల నుంచి 30 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు. మరోవైపు మీ వ్యాపారం పెద్ద స్థాయిలో ఉంటే త్వరలో 80 నుంచి 90 వేల బుకింగ్‌లను సాధించవచ్చు. కేవలం 4-5 ఆర్డర్లు మాత్రమే మీ పెట్టుబడి ఖర్చును కవర్ చేస్తాయి. మిగిలిన ఆర్డర్లు అన్ని మీకు లాభంగానే ఉంటాయి.

Tags:    

Similar News