SBI New Rules: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్.. కొత్త నిబంధనలు తెలిస్తే షాక్..!
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI) ఇప్పుడు మరికొన్ని నిబంధనలని మార్చింది.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI) ఇప్పుడు మరికొన్ని నిబంధనలని మార్చింది. ఇప్పుడు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి కొత్త ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఎస్బీఐ ఏ బ్రాంచ్‌లోనూ డబ్బును డిపాజిట్ చేయలేరు. అంతేకాదు విత్‌డ్రా కూడా చేయలేరు. ఇప్పుడు మీ బంధువులలో ఎవరికైనా బ్యాంకులో ఖాతా ఉంటే మీరు గ్రీన్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది లేకుండా మీరు బ్యాంక్ ఖాతాలో డబ్బుని జమ చేయలేరు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఎస్బీఐ గ్రీన్ కార్డ్ అనేది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లాంటిది. ఇందులో మీ బ్యాంక్ ఖాతా గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. కేవలం రూ.20 రుసుము చెల్లించి ఎస్బీఐలోని ఏదైనా బ్రాంచ్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత మీరు ఎప్పుడు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లినా దానిని వెంట తీసుకెళ్లాలి. బ్యాంకు సిబ్బందికి డబ్బు, ఎస్బీఐ గ్రీన్ కార్డ్ అందించాలి. వారు ఎస్బీఐ గ్రీన్ కార్డ్‌ను మెషీన్‌పై ఉంచి మీ డబ్బును డిపాజిట్ చేస్తారు. ఈ విధంగా డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత మెషీన్ నుంచి రశీదు కూడా తీసుకోవచ్చు. దీనిని మీ రుజువుగా దగ్గర ఉంచుకోవచ్చు.
మీకు ఎస్బీఐ గ్రీన్ కార్డ్ లేకుండా కూడా డబ్బు డిపాజిట్ చేయగలరు. అది ఎలాగంటే సమీపంలోని ఏదైనా ఏటీఎంకి వెళ్లాలి. అక్కడ మీరు ఏటీఎం మెషీన్ ద్వారా మాత్రమే డబ్బును డిపాజిట్ చేయగలరు. బ్యాంకు శాఖలో డబ్బు డిపాజిట్ చేయడం కుదరదు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు బ్యాంక్ ఏటీఎం నుంచి 10000 రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే OTP అవసరం. మోసం జరగకుండా ఉండేందుకు బ్యాంక్ ఈ కొత్త నిబంధనను రూపొందించింది.