Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

* క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని తప్పనిసరిగా తనిఖీ చేయాలి * పాలసీని ముందుగానే కొనుగోలు చేయండి

Update: 2021-11-23 08:18 GMT

టర్మ్ ఇన్సూరెన్స్(ఫైల్ ఫోటో)

Term Insurance: ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి వ్యక్తికి కచ్చితంగా అవసరం. అది మీరున్నా లేకపోయినా మీ కుటుంబానికి అండగా ఉంటుంది. ఒక భరోసా కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఎవరి బడ్జెట్‌లో వారికి లైఫ్ ఇన్సూరెన్స్‌ కానీ టర్మ్ ఇన్సూరెన్స్‌ కానీ ఉండాలి. అయితే ఇందులో టర్మ్‌ ఇన్సూరెన్స్‌కి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ పాలసీ తీసుకునేటప్పుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కుటుంబానికి సరిపడా కవర్ చేయాలి

టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ అవసరాలను సరిగ్గా అంచనా వేయండి. ద్రవ్యోల్బణాన్ని కూడా గుర్తుంచుకోండి. మీ వార్షిక ఆదాయం కంటే కనీసం 8-10 రెట్లు ఎక్కువగా ఉండాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

కాల వ్యవధిని గుర్తుంచుకోండి

ఇది కాకుండా పాలసీ వ్యవధిని కూడా గుర్తుంచుకోవాలి. మీరు చిన్నవారైతే పాలసీ వ్యవధి ఎక్కువ ఉండాలి. మీ వయస్సు ఎక్కువగా ఉంటే పాలసీ వ్యవధి తక్కువగా ఉంటుంది.

ఎటువంటి సమాచారాన్ని దాచవద్దు

మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీ గురించిన మొత్తం సమాచారాన్ని తెలియజేయాలి. పాలసీదారు అనారోగ్యానికి సంబంధించిన విషయం దాచిపెడితే క్లెయిమ్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వైద్య పరిస్థితి, కుటుంబ వైద్య చరిత్ర, ప్రమాదకర జీవనశైలి, ధూమపానంతో సహా అన్ని విషయాలను చెప్పాలి.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని తప్పనిసరిగా తనిఖీ చేయాలి

మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని తప్పకుండా తనిఖీ చేయాలి. కంపెనీకి మంచి సెటిల్‌మెంట్ రేషియో ఉంటే అప్పుడు పాలసీని కొనుగోలు చేయాలి.

పాలసీని ముందుగానే కొనుగోలు చేయండి

టర్మ్ ఇన్సూరెన్స్‌తో వివిధ రకాల రైడర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి టర్మ్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు అనవసరమైన రైడర్‌లను కొనుగోలు చేయకుండా ఉండండి. మీరు లేనప్పుడు ఆ రైడర్‌కు ఎలాంటి అర్ధం ఉండకపోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పాలసీని కొనుగోలు చేయండి.

Tags:    

Similar News