Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. మనీ విత్‌ డ్రా రూల్స్‌ తెలుసుకోండి..!

Mutual Funds: ఈ రోజుల్లో చాలామంది మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు.

Update: 2023-03-18 11:30 GMT

Mutual Funds:మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. మనీ విత్‌ డ్రా రూల్స్‌ తెలుసుకోండి..!

Mutual Funds: ఈ రోజుల్లో చాలామంది మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని ప్రజలు ఇటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ రిస్క్ ఉన్నందున చాలామంది మ్యూచువల్ ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఇందులో మెచ్యూరిటీ కంటే ముందుగానే డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సమయానికి ముందే మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఇది అన్ని రకాల మ్యూచువల్ ఫండ్‌లకు వర్తించదు. కొన్ని మ్యూచువల్ ఫండ్‌లకి లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి డబ్బును విత్‌ డ్రా చేయాలంటే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. చాలా మ్యూచువల్ ఫండ్ పథకాలు ఓపెన్ ఎండెడ్‌గా ఉన్నాయి. వీటినుంచి ఎప్పుడైనా పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. లేదా కొద్ది కొద్దిగా డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి వాటిపై కొద్ది మొత్తంలో ఫైన్‌ ఉంటుంది.

అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS) మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నాయి. ఇవి ఆదాయపు పన్ను సెక్షన్-80C కింద పన్ను మినహాయింపు పొందుతాయి. అందుకే ఈ పథకాలపై మూడేళ్లపాటు 'లాక్ ఇన్ పీరియడ్' ఉంటుంది. ఈ స్కీమ్‌ల నుంచి సమయానికి ముందే డబ్బు విత్‌డ్రా చేసినప్పుడల్లా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది 5 నుంచి 10 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది.

మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి డబ్బును విత్‌ డ్రా చేయాలంటే రిడీమ్ చేయగల కనీస యూనిట్లు మీ స్కీమ్ డాక్యుమెంట్‌లో కనిపిస్తాయి. వీటి ద్వారా విత్‌ డ్రా చేసుకోవచ్చు. అలాగే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల కార్యాలయాల్లో, డీమ్యాట్ ఖాతాల ద్వారా లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News