UIDAI: మీకు ఆధార్‌కార్డుతో ఏదైనా సమస్య ఉంటే ఈ ఒక్క పనిచేయండి..!
UIDAI: మీకు ఆధార్ కార్డుతో సమస్య ఉంటే ఇప్పుడు ఒకే కాల్‌తో పరిష్కరించుకోవచ్చు.
UIDAI: మీకు ఆధార్ కార్డుతో సమస్య ఉంటే ఇప్పుడు ఒకే కాల్‌తో పరిష్కరించుకోవచ్చు. UIDAI ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది. UIDAI హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.. హెల్ప్‌లైన్ సంఖ్య 1947. ఈ సంఖ్య గుర్తుంచుకోవడం కూడా చాలా సులభం. ఎందుకంటే ఇది దేశానికి స్వాతంత్యం వచ్చిన సంవత్సరం. ఈ నెంబర్ టోల్ ఫ్రీ.. ఐవీఆర్‌ఎస్ మోడ్‌లో సంవత్సరానికి 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లో ప్రజలకు ఆధార్ రిజిస్ట్రేషన్ కేంద్రాలు, రిజిస్ట్రేషన్ తర్వాత ఆధార్ నంబర్ స్థితి, ఇతర ఆధార్ నంబర్ల గురించిన సమాచారం లభిస్తుంది. అదనంగా ఎవరైనా వారి ఆధార్ కార్డును కోల్పోయినా, ఇంకా పోస్ట్ ద్వారా స్వీకరించకపోయినా వెంటనే కాల్ చేసి సమాచారం పొందవచ్చు. UIDAI ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఆధార్ హెల్ప్‌లైన్ రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది.
IVRS ద్వారా 1947 కు కాల్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని 24 గంటలు వినియోగించుకోవచ్చు. జాతీయ సెలవులను మినహాయించి ఏజెంట్లను సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి 11 వరకు, ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. ఆధార్‌కు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ ఆధార్ సేవ 12 భాషలలో లభిస్తుంది. ఈ 12 భాషలలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ మరియు ఉర్దూ ఉన్నాయి.