Personal Loan: పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!

Personal Loan: డబ్బు అవసరం ఏ విధంగా వస్తుందో ఎవ్వరికి తెలియదు. అత్యవసర సమయంలో మాత్రం అందరికి గుర్తుకువచ్చేది పర్సనల్‌ లోన్‌ మాత్రమే.

Update: 2023-07-21 12:00 GMT

Personal Loan: పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!

Personal Loan: డబ్బు అవసరం ఏ విధంగా వస్తుందో ఎవ్వరికి తెలియదు. అత్యవసర సమయంలో మాత్రం అందరికి గుర్తుకువచ్చేది పర్సనల్‌ లోన్‌ మాత్రమే. ఇది చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. పర్సనల్‌ లోన్స్‌ సాధారణంగా వివాహం లేదా పుట్టిన రోజు వేడుకలకి, ఇల్లు లేదా కారు కొనడం కోసం, ముందస్తు చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు తీర్చడానికి ఉపయోగిస్తారు. అయితే పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి పర్సనల్ లోన్

పర్సనల్‌ లోన్‌ అనేది మీ క్రెడిట్‌ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. ఇవి అసురక్షిత రుణాల కిందికి వస్తాయి కాబట్టి రుణదాతకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఫలితంగా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండే దరఖాస్తుదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే ఇది రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుకి పర్సనల్‌ లోన్‌ లభిస్తుంది.

వడ్డీ రేట్లను సరిపోల్చండి

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఎలాంటి వడ్డీరేట్లు ఉన్నాయో గమనించాలి. ఎందుకంటే వడ్డీరేట్లు అనేవి వివిధ బ్యాంకులలో వివిధ రకాలుగా ఉంటాయి. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉంటుందో అక్కడ తీసుకుంటే సరిపోతుంది. అయితే లోన్ తీసుకునే ముందు మీ అవసరం సరైనదేనా కాదా అని ఒకసారి బేరిజు వేసుకోవాలి. మీరు తీసుకుంటున్న లోన్‌ డబ్బు మీ అవసరాలను తీరుస్తుందో లేదో గమనించాలి. పూర్తిగా నిర్థారించుకున్నాక లోన్‌ తీసుకోవాలి.

Tags:    

Similar News