Alert: రేషన్ కార్డుదారులకి అలర్ట్.. ఈ సమస్యలు ఏర్పడితే ఇలా చేయండి..!
Alert: ప్రభుత్వం కోట్లాది మంది పేద ప్రజలకి తెల్ల రేషన్ కార్డు ద్వారా సబ్సిడీ కింద రేషన్ సరుకులని అందిస్తోంది.
Alert: ప్రభుత్వం కోట్లాది మంది పేద ప్రజలకి తెల్ల రేషన్ కార్డు ద్వారా సబ్సిడీ కింద రేషన్ సరుకులని అందిస్తోంది. వీటివల్లనే భూమిలేని ప్రజలు, కార్మికులు, రోజువారీ కూలీలు, వలస కార్మికులకి మూడు పూటల అన్నం లభిస్తుంది. అయితే అన్ని ప్రభుత్వం స్కీంల మాదిరిగానే ఇందులో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు పేదలకి చెందాల్సిన సరుకులని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇంకొందరు సాకులు చూపి మొత్తమే రేషన్ అందించడం లేదు. మరికొందరు తూకంలో మోసాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు మీకు ఎదురైతే వెంటనే ఈ నెంబర్లకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. అది ఎలాగో తెలుసుకుందాం.
ఫిర్యాదు చేయడం సులభం
ప్రధానంగా రేషన్ షాపులను నిర్వహిస్తున్న డీలర్లు తప్పులకు పాల్పడుతున్నారు. సరైన రేషన్ అందడం లేదని, తూకంలో మోసాలు చేస్తున్నారాని చాలామంది ప్రజలు వాపోతున్నారు. నాణ్యత లేని ఆహార ధాన్యాలు అందుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లయితే ఫిర్యాదు చేయడానికి ప్రతి రాష్ట్రానికి హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్లకి ఫోన్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు.
డీలర్‌పై కఠిన చర్యలు
ఆన్‌లైన్‌లో రాష్ట్రానికి అనుగుణంగా హెల్ప్‌లైన్ నంబర్‌లను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ https://nfsa.gov.in లో హెల్ప్‌లైన్ నంబర్‌ల జాబితా ఉంచారు. ఈ నంబర్‌లకు కాల్ చేసి సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత సంబంధిత డీలర్‌పై విచారణ జరుపుతారు. అతని తప్పు తేలితే డీలర్‌షిప్ క్యాన్సల్ చేయడమే కాకుండా జరిమానా, జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ నెంబర్లు తెలుసుకోండి..?
తెలంగాణ: 1800-4250-0333
ఆంధ్రప్రదేశ్: 1800-425-2977
కర్ణాటక: 1800-425-9339
మహారాష్ట్ర: 1800-22-4950
కేరళ: 1800-425-1550
తమిళనాడు: 1800-425-5901