Alert: కస్టమర్లకు అలర్ట్..శని, ఆదివారాల్లో ఈ బ్యాంకుల సర్వీసులు పనిచేయవ్
Alert: HDFC, AXIS బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఈరోజు, రేపు ( జులై 13,14) ఈ బ్యాంకులకు సంబంధించి కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Alert:దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC బ్యాంకు జులై13వ తేదీన తమ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 13న శనివారం ఉదయం 3గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ఈ అప్ గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఖాతాదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులో ఉండవని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
మనదేశంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు ఏకంగా 93.2 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. కాబట్టి ప్రతి రోజూ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే హెచ్ డీ ఎఫ్ సీ సిస్టమ్ అప్ గ్రేడ్ ప్రక్రియ అనేది సుమారు 13.30 గంటల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఆ సమయంలో బ్యాంకింగ్, పేమెంట్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తెలిపింది. ఖాతాదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు జులై 12నే తగినంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలని..ఏవైనా చెల్లింపులు చేయాల్సి ఉంటే వాటినే ముందుగానే చేసుకోవాలని సూచించింది. తమ కస్టమర్లపై ప్రభావం తగ్గించేందుకు సెలవు రోజున అప్ గ్రేడింగ్ సిస్టమ్ ను చేపడుతున్నట్లు తెలిపింది.
అప్ గ్రేడింగ్ ప్రక్రియలో భాగంగా జులై 13వ తేదీ తెల్లవారుజామున 3గంటల నుంచి 3.45 గంటల వరకు తెల్లవారిన తర్వాత ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా పాక్షికంగానే అందుబాటులో ఉంటాయని బ్యాంక్ పేర్కొంది. ఇక ఏటీఎం, డెబిట్ కార్డులకు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని సర్వీసులు కొంత సమయం పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. కానీ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులను ఆన్ లైన్ లావాదేవీల కోసం నిర్దిష్ట పరిమితి మేరకు వాడుకోవచ్చు. అలాగే స్వైప్ మెషిన్స్ ద్వారా కూడా నిర్దిష్ట పరిమితి మేరకు క్రెడిట్ కార్డును వాడుకోవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది. డెబిట్ కార్డు యూజర్లు ఏటీఏం నుంచి నిర్దిష్ట పరిమితి మేరకు నగదు కూడా డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
అటు యాక్సెస్ బ్యాంకు సర్వీసులు కూడా 13,14 తేదీల్లో అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. యాక్సెస్ బ్యాంకులోకి సిటీ బ్యాంక్ బిజినెస్ విలీన ప్రక్రియ జరగనుండడమే దీనికి కారణమని తెలిపింది.