Alert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. మే 31లోపు ఈ పని చేయకపోతే 4 లక్షల నష్టం..!

Alert: సామాన్య పౌరుల కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది.

Update: 2022-05-29 05:30 GMT

Alert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. మే 31లోపు ఈ పని చేయకపోతే 4 లక్షల నష్టం..!

Alert: సామాన్య పౌరుల కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. అందులో ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY),ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)ఉన్నాయి. మీరు చిన్న ప్రీమియం చెల్లిస్తే చాలు ఈ పథకం ప్రయోజనాలు మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయి. ప్రతి సంవత్సరం మే 31వ తేదీ నాటికి వీటిని పునరుద్ధరిస్తారు. ఆ సమయానికి మీ బ్యాంక్ ఖాతాలో తగినంత మొత్తాన్ని కలిగి ఉండటం అవసరం. ఈ పునరుద్ధరణ మొత్తం గత సంవత్సరం ఎవరైతే ఈ పథకాలకి దరఖాస్తు చేసుకున్నారో వారి ఖాతాల నుంచి డెబిట్‌ అవుతుంది.

330కి 2 లక్షల కవర్

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు చేరవచ్చు. ఇందుకోసం ఏడాదికి రూ.330 చెల్లిస్తే రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. అదేవిధంగా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు చేరవచ్చు. ఇందులో రూ.12 చెల్లిస్తే రూ.2 లక్షల కవర్ లభిస్తుంది.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద, ప్రమాదం కారణంగా మరణిస్తే బీమాదారుడికి రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష ఇచ్చే నిబంధన ఉంది. దీని ప్రకారం రెండు పథకాలకు మే 31 వరకు వార్షిక ప్రీమియం రూ.342 చెల్లించాలి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే మీరు ఈ బీమా రక్షణను పొందలేరు. ఈ పరిస్థితిలో, మీరు రూ.4 లక్షల బీమా రక్షణను కోల్పోతారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News