Aadhaar: ఆధార్‌ అప్‌డేట్‌.. పెరిగిన లావాదేవీలు..!

Aadhaar: దేశంలో ఆధార్‌కార్డు అత్యంత ముఖ్యమైన పత్రం.

Update: 2022-10-27 05:21 GMT

Aadhaar: ఆధార్‌ అప్‌డేట్‌.. పెరిగిన లావాదేవీలు..!

Aadhaar: దేశంలో ఆధార్‌కార్డు అత్యంత ముఖ్యమైన పత్రం. ఇది లేకుండా దాదాపు ఏ పని జరగదు. దేశంలో ఎక్కడైనా పౌరులు తమ గుర్తింపును ధృవీకరించుకోవడానికి ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. అదే సమయంలో అనేక ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. దేశంలోని ప్రతి పౌరునికి భారత ప్రభుత్వం ఆధార్ కార్డు జారీ చేస్తుంది. అయితే ఆధార్‌కి సంబంధించి మరో విషయం కూడా బయటికి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం.

e-KYC లావాదేవీలు

వాస్తవానికి సెప్టెంబర్‌లో దేశంలో ఆధార్ ద్వారా 25.25 కోట్ల ఈ-కెవైసి లావాదేవీలు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఈ సంఖ్య 7.7 శాతం ఎక్కువ. e-KYC లావాదేవీ అనేది ఆధార్ కార్డ్ హోల్డర్ స్పష్టమైన అనుమతితో జరుగుతుంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తం 2022 సెప్టెంబర్ చివరి వరకు AEPS, మైక్రో ATM నెట్‌వర్క్ ద్వారా 1,549.84 కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయని సమాచారం.

ఒక్క సెప్టెంబరులోనే భారతదేశం అంతటా 21.03 కోట్ల AEPS లావాదేవీలు జరిగాయి. ఆధార్ ద్వారా 175.41 కోట్ల ధృవీకరించబడిన లావాదేవీలు జరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆధార్‌ కార్డు కీలకంగా మారింది. గుర్తింపుకార్డుకానే కాకుండా అన్ని విషయాలలో ఇది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని పనులలో ఆధార్‌ ప్రాబల్యం పెరుగుతుందని తెలుస్తోంది.

Tags:    

Similar News