GST Collection: మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

GST Collection: జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Update: 2022-09-01 09:24 GMT

GST Collection: మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

GST Collection: జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వరుసగా ఆరో నెలలోనూ 1.40 లక్షల కోట్లు దాటాయి. ఆగస్టు నెలలో 28 శాతం పెరిగిన పన్ను వసూళ్లు 1.43 లక్షల కోట్లు ఖజానాకు జమ అయినట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఆగస్టులో మొత్తం లక్షా 43వేల 612 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. అందులో సెంట్రల్ జీఎస్టీ 24వేల 710 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ 30వేల 951 కోట్లుగా ఉంది. సమీకృత జీఎస్టీ 77వేల 782 కోట్లు, సెస్‌ 10వేల 168 కోట్లు వసూలు అయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. గతేడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఆగస్టులో 28 శాతం అధికంగా వసూలైనట్లు వివరించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం జీఎస్టీ రాబడులపై ప్రభావం చూపినట్లు ఆర్థికశాఖ పేర్కొంది.


Tags:    

Similar News