Top-6 News of the Day: కన్నీళ్లు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-31 12:30 GMT

Top-6 News of the Day(31/07/2024)

Top-6 News of the Day(31/07/2024)

1. కంటతడి పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

సబితా ఇంద్రారెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కంటతడి పెట్టుకున్నారు. అసెంబ్లీలో తననుద్దేశించి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏం ముఖం పెట్టుకొని వచ్చారని వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో సహచర ఎమ్మెల్యేలు ఆమెను సముదాయించారు. కాంగ్రెస్ నుంచి తాను బయటకు వెళ్లేలా చేశారన్నారు. అసెంబ్లీలో తనపై చేసిన ఆరోపణలకు తనను సమాధానం చెప్పకుండానే వాయిదా వేశారన్నారు.


 2. పూజా ఖేద్కర్ ట్రైనీ ఐఎఎస్ అభ్యర్ధిత్వం రద్దు

పూజా ఖేద్కర్ ట్రైనీ ఐఎఎస్ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసింది యూపీఎస్ సీ. భవిష్యత్తులో యూపీఎస్ సీ నిర్వహించే అన్ని పరీక్షలకు హాజరుకాకుండా ఆమెపై నిషేధం విధించారు. సివిల్స్ పరీక్షల్లో తన అభ్యర్ధిత్వాన్ని కాపాడుకోవడం కోసం నాన్ క్రిమిలేయర్ కోటాలను దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ నిర్వహించిన తర్వాత ఆమె దోషిగా కమిషన్ నిర్ధారించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 నిబంధనలను ఆమె ఉల్లంఘించిందని కమిషన్ నిర్ధారించింది.


 3. కాంగ్రెస్ లోకి ఆహ్వానించా.. సీఎం అవుతానని చెప్పా: రేవంత్ పై సబితా

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం జరిగింది. వీరిద్దరూ కాంగ్రెస్ లో పనిచేసిన సమయంలో ఘటనలను సభలో ప్రస్తావించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ మంత్రి సీతక్క వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తనను ఎందుకు టార్గెట్ చేశారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ ను తాను ఆహ్వానించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ లో భవిష్యత్తు ఉంటుంది. సీఎం కూడా అవుతావని తమ్ముడిగా రేవంత్ కు తాను ఆశీర్వాదాలు ఇచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2019 లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని చెప్పి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తనను మోసం చేసిందని ఆయన విమర్శించారు.


4. యూపీఎస్ సీ కొత్త ఛైర్ పర్సన్ గా ప్రీతిదాస్ నియామకం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా ఐఏఎస్ అధికారిణి ప్రీతిసుదాస్ ను నియమించారు. ఇప్పటివరకు ఛైర్ పర్సన్ గా ఉన్న మనోజ్ సోని రాజీనామా చేయడంతో ప్రీతిసుదాస్ కు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత మనోజ్ సోని రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాతోనే సోని రాజీనామా చేసినట్టుగా యూపీఎస్ సీ వర్గాలు ప్రకటించాయి.


 5. ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య

ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్న హమాస్ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ లో హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ ప్రకటించింది. ఈ విషయాన్ని హమాస్ కూడా ధృవీకరించింది. టెహ్రాస్ లో జరిగిన దాడిలో హనియా ఆయన బాడీగార్డ్ మరణించినట్టుగా తెలిపింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది.


 6. కుప్పం వైసీపీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరిక

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీకి చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్రంలో ఎన్ డీ ఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరుతున్నట్టుగా వారు తెలిపారు. త్వరలోనే మరికొందరు నాయకులు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News