Top 6 News: అక్రమ నిర్మాణాలనే కూల్చామన్న హైడ్రా రంగనాథ్: మరో 5 ముఖ్యాంశాలు

పేదలు, పెద్దలు అనే తేడా తమకు లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే విషయమై సిట్ విచారణ ప్రారంభించింది.

Update: 2024-09-28 13:22 GMT

Top 6 News

1. పేదల వెనుక ఉన్న పెద్దలను కొడుతున్నాం:హైడ్రా కమిషనర్ రంగనాథ్
పేదలు, పెద్దలు అనే తేడా తమకు లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బయటకు పేదలు కన్పించినా వారి వెనుక ఉన్న పెద్దలకు తెలియడానికే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలున్నాయనే విషయమై తెరవెనుక కసరత్తు జరుగుతుందని రానున్న రోజుల్లో వాటిని కూల్చివేస్తామన్నారు. హైడ్రా అంటే భరోసా అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలనే కూల్చివేశామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశాం.. దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదు. ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడా కూల్చలేదని ఆయన చెప్పారు.

2. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగం: సిట్ విచారణ
తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే విషయమై సిట్ విచారణ ప్రారంభించింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని టీమ్ శనివారం తిరుమలకు వచ్చారు. తొలుత స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తిరుమలలో నెయ్యి సరఫరాకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి ఎలా తిరుమలకు చేరింది. దీని వెనుక ఎవరున్నారనే విషయాలను సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

3. నిర్మలా సీతారామన్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగుళూరు తిలక్ నగర్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట జేపీకి నిధులు వచ్చేలా పారిశ్రామికవేత్తలను బెదిరించారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెదిరించారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

4. ఇజ్రాయెల్ దాడిలో హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి
ఇజ్రాయెల్ దాడిలో హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఈ విషయాన్ని హెజ్ బొల్లా ధృవీకరించింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని హెజ్ బొల్లా ప్రకటించింది. ఈ దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు కూడా చనిపోయారు.

5. హైడ్రోజన్ బాంబు:హైడ్రాపై హరీష్ రావు
హైడ్రా అంటే హైడ్రోజన్ బాంబుగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం హైడ్రా బాధితులతో ఆయన మాట్లాడారు. బాధితులకు తమ పార్టీ తరపున లీగల్ సెల్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పేదల కన్నీళ్లపై అభివృద్ది ఏంటని ఆయన ప్రశ్నించారు. మూసీ నది సుందరీకరణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

6. వైసీపీ ప్రచారంపై జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
తప్పడు ప్రచారాలు, అసత్యాల ప్రచారంలో వైసీపీ ముందుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ వివాదం విషయంలో వైసీపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.

Tags:    

Similar News