Ultraviolette Tesseract: ఇది మామూలు స్కూటర్ కానే కాదు.. 48 గంటల్లో 20 వేల బుకింగ్స్.. కారును మించిన ఫీచర్స్..!
Ultraviolette Tesseract: మార్కెట్లో రోజుకో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ సందడి చేస్తోంది. ఓవైపు దిగ్గజ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తుంటే స్టార్టప్ కంపెనీలు సైతం గట్టి పోటీనిస్తున్నాయి.

Ultraviolette Tesseract: ఇది మామూలు స్కూటర్ కానే కాదు.. 48 గంటల్లో 20 వేల బుకింగ్స్.. కారును మించిన ఫీచర్స్..!
Ultraviolette Tesseract: మార్కెట్లో రోజుకో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ సందడి చేస్తోంది. ఓవైపు దిగ్గజ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తుంటే స్టార్టప్ కంపెనీలు సైతం గట్టి పోటీనిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరుకు చెందిన అల్ట్రావయలెట్ ఆటోమోటివ్ ఇటీవలే సరికొత్త 'టెసెరాక్ట్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది. ఇప్పుడు ఈ కొత్త స్కూటర్‌కు కస్టమర్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టెసెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షల ఎక్స్-షోరూమ్. అయితే కంపెనీ దీనిని మొదటి 10,000 మంది కొనుగోలుదారులకు రూ. 1.20 లక్షల ధరకు విక్రయించాలని నిర్ణయించింది. విపరీతమైన స్పందన కారణంగా, ఇక నుండి ఈ తగ్గింపు ఆఫర్ 50,000 మంది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ఈ-స్కూటర్ బుకింగ్స్ ఓపెన్‌లో ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌లను సందర్శించి, రూ.999 ముందస్తు మొత్తాన్ని చెల్లించి ఆర్డర్ చేయచ్చు.
అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ఈ-స్కూటర్ వివిధ రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఫుల్ ఛార్జింగ్‌తో 261 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది. డెసర్ట్ బ్లాక్, సోనిక్ పింక్, స్టెల్త్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఎంపికలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టచ్‌స్క్రీన్-డిస్‌ప్లే, కీలెస్ యాక్సెస్,మ్యూజిక్ కంట్రోల్‌తో సహా వివిధ రకాల ఫీచర్స్ చూడచ్చు. 34-లీటర్ కెపాసిటీ అండర్-సీట్ స్టోరేజీని కూడా ఉంది. డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడర్కోసం డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మొత్తంమీద, కొత్త అల్ట్రావయలెట్ టెసెరాక్ట్ ఈ-స్కూటర్‌కు వినియోగదారుల నుండి ఇంత అద్భుతమైన స్పందన వస్తుందని కంపెనీ ఊహించలేదు. కొత్త స్కూటర్ రాబోయే రోజుల్లో మరిన్ని బుకింగ్‌లను పొందే అవకాశం ఉంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026 మొదటి త్రైమాసికం నాటికి ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కావచ్చని అంచనా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.