Maruti Suzuki Price Hike: మార్చి లోపు కొనేయండి.. మారుతి ధరల మోత.. అప్పటి నుంచే అమల్లోకి..
Maruti Suzuki Price Hike: మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మార్చి నెలాఖరులోపు మారుతి వాహనాలను బుక్ చేసుకోండి.

Maruti Suzuki Price Hike: మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మార్చి నెలాఖరులోపు మారుతి వాహనాలను బుక్ చేసుకోండి. ఎందుకంటే మారుతి సుజుకి కార్ల ధరలు ఏప్రిల్ 2025 నుండి పెరగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఇండియా తన అన్ని వాహనాల ధరలను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా వాహనాల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది.
మారుతి సుజుకి కంపెనీ మాత్రమే కాకుండా మహీంద్రా, స్కోడా, టాటా మోటార్స్, కియా, జీప్, సిట్రోయెన్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఎంజి మోటార్, ఆడి వంటి కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నాయి. అన్ని కంపెనీలు తమ వాహనాల ధరలను 2 నుంచి 4 శాతం పెంచుతున్నాయి.
వాహనాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
1. ముడిసరుకు ధరలు పెరగడం
వాహనాల్లో ఉపయోగించే ఉక్కు, అల్యూమినియం, రాగి తదితర లోహాల ధరలు పెరగడం.
2. నిర్వహణ ఖర్చులు
కంపెనీ ఉత్పత్తి, లాజిస్టిక్స్ మొదలైన ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపాలనుకుంటోంది.
3. గ్లోబల్ మార్కెట్‌లో పోటీ
భారత ఆటో పరిశ్రమపై ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ కారణంగా ధరలు పెరుగుతున్నాయి.
4. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి
ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి. దీని కారణంగా పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలు పెరిగాయి.
జనవరిలో మారుతి తన పలు వాహనాల ధరలను రూ.1500 పెంచి రూ.32,500కు పెంచింది. ఫిబ్రవరిలో ధరల పెరుగుదల ట్రెండ్ కొనసాగింది. ఇప్పుడు కంపెనీ ఏప్రిల్‌లో కూడా ధరను పెంచబోతోంది. గ్లోబల్ మార్కెట్‌లో పోటీ ఉన్నప్పటికీ, మారుతీ వాహనాలపై వినియోగదారులకు గొప్ప విశ్వాసం ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ చాలా మంచి వ్యాపారం చేసింది. కంపెనీ ఫిబ్రవరి 2025లో మొత్తం 1,60,791 కార్లను విక్రయించింది, ఇది ఫిబ్రవరి 2024లో విక్రయించిన 1,60,272 యూనిట్ల కంటే 0.32శాతం ఎక్కువ. అయితే కంపెనీ జనవరి 2025లో 1,73,599 కార్లను విక్రయించింది, ఫిబ్రవరిలో అమ్మకాలు 7శాతం తగ్గాయి.