Tata EV Portfolio: మనల్నెవడ్రా ఆపేది.. శ్రీలంక రోడ్లపై టాటా కార్లు.. ఏ మోడల్స్ ఉన్నాయో తెలుసా..?

Tata EV Portfolio: భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ప్రపంచ విస్తరణ రంగంలో కొత్త విజయాన్ని సాధించింది.

Update: 2025-03-17 14:15 GMT

Tata EV Portfolio: మనల్నెవడ్రా ఆపేది.. శ్రీలంక రోడ్లపై టాటా కార్లు.. ఏ మోడల్స్ ఉన్నాయో తెలుసా..?

Tata EV Portfolio: భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ప్రపంచ విస్తరణ రంగంలో కొత్త విజయాన్ని సాధించింది. కంపెనీ ఇప్పుడు తన కొత్త ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను శ్రీలంకలో ప్రారంభించింది. కంపెనీ ముఖ్యమైన భాగస్వామి DIMO సహకారంతో ఈ పోర్ట్‌ఫోలియో అందించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా కర్వ్ వంటి ప్రధాన ఎస్‌యూవీలతో పాటు, ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీ కూడా మార్కెట్‌లోకి విడుదలైంది.

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ యష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ శ్రీలంకలో తమ ఉనికిని నెలకొల్పేందుకు మేము సంతోషిస్తున్నామని అన్నారు. టాటా మోటార్స్ సంవత్సరాలుగా గణనీయమైన మార్పులను చేసింది. ఈ కొత్త గేమ్-ఛేంజింగ్ ఉత్పత్తులతో శ్రీలంక మార్కెట్లోకి ప్రవేశించడం మాకు గర్వకారణం. వినియోగదారులను ఆకర్షించడమే కాకుండా మార్కెట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు ఈ కొత్త ఆఫర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ వాహనాలు బోల్డ్ డిజైన్‌లు, అత్యాధునిక ఫీచర్లు, హై సేఫ్టీ స్టాండర్డ్స్, అద్భుతమైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌లను అందిస్తాయి.

టాటా టియాగో ఈవీ ఇప్పటికే భారతదేశం, నేపాల్, భూటాన్‌లలో ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తెచ్చింది. DIMO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ పండిటేజ్ మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌తో తన భాగస్వామ్యం గురించి థ్రిల్‌గా ఉన్నానని అన్నారు. శ్రీలంకలో మార్కెట్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత, టాటా మోటార్స్ అక్కడ ప్రవేశించిన మొదటి ప్యాసింజర్ వాహన బ్రాండ్‌గా అవతరించింది.

టాటా మోటార్స్ తన అన్ని ప్యాసింజర్ వాహనాలకు మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల తయారీ వారెంటీతో వస్తుందని ప్రకటించింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు, ఈ వారంటీ మూడు సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కాకుండా ఈవీ అధిక-వోల్టేజ్ బ్యాటరీ, మోటారుకు ఎనిమిది సంవత్సరాలు లేదా 1,65,000 కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది, ఇది వినియోగదారులకు అదనపు భద్రత, నమ్మకమైన అనుభవాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News