Tata Curvv Sales: టాటాకు తిరుగులేదు భయ్యా.. గత నెలలో పోటీపడి కొనేశారు..!

Tata Curvv Sales: టాటా కర్వ్ ఒక ప్రసిద్ధ కూపే ఎస్‌యూవీ. గతేడాది దేశీయ విపణిలో అమ్మకానికి వచ్చిన ఈ కారు బాగానే అమ్ముడవుతోంది.

Update: 2025-03-13 00:30 GMT
Tata Curvv Sales

Tata Curvv Sales: టాటాకు తిరుగులేదు భయ్యా.. గత నెలలో పోటీపడి కొనేశారు..!

  • whatsapp icon

Tata Curvv Sales: టాటా కర్వ్ ఒక ప్రసిద్ధ కూపే ఎస్‌యూవీ. గతేడాది దేశీయ విపణిలో అమ్మకానికి వచ్చిన ఈ కారు బాగానే అమ్ముడవుతోంది. రోడ్డుపై ప్యాలెస్‌లా ఉండే కొత్త కర్వ్ ఎస్‌యూవీని కూడా కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం టాటా ఫిబ్రవరి కర్వ్ ఎస్‌యూవీ అమ్మకాల నివేదికను వెల్లడించింది. గత నెలలో టాటా మోటార్స్ దాదాపు 3,483 కర్వ్ ఎస్‌యూవీలను విజయవంతంగా విక్రయించింది. జనవరి నెలలో విక్రయించిన 3087 కార్లతో పోలిస్తే, నెలవారీ (MoM) వృద్ధి 12.83శాతం.

2024లో కూడా టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీ భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో 4,994 యూనిట్లు, నవంబర్‌లో 5,101 యూనిట్లు, అక్టోబర్‌లో 5,351 యూనిట్లు, సెప్టెంబర్‌లో 4,763 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం టాటా కర్వ్ ఎస్‌యూవీ పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫ్యూయల్ వేరియంట్ ధర రూ.10 లక్షల నుంచి మొదలై, రూ.19 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ GDI టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ మాన్యువల్/7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. టాటా కర్వ్ లీటర్‌పై 11 నుండి 15 kmpl మైలేజీని ఇస్తుంది.

టాటా కర్వ్‌‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 4-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా వివిధ ఫీచర్స్ ఉన్నాయి. అలానే భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాను చూడచ్చు.

టాటా కర్వ్ ఎలక్ట్రిక్ విషయానికి వస్తే దీని ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారులో 45 కిలోవాట్, 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికతో వస్తుంది. ఫుల్ ఛార్జింగ్ పై 430 నుంచి 502 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) ఇస్తుంది. కర్వ్ ఎస్‌యూవీలో 5 మంది సులభంగా ప్రయాణింవచ్చు. 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, JBL 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News