2025 Thar Roxx: అదరగొడుతున్న మహీంద్రా.. 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్'గా థార్.. కారణం ఇదేనా..!
2025 Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ ప్రతిష్టాత్మక 2025 కార్- బైక్ అవార్డ్స్‌లో “ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్” టైటిల్‌ను గెలుచుకుంది

2025 Thar Roxx: అదరగొడుతున్న మహీంద్రా.. 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్'గా థార్.. కారణం ఇదేనా..!
2025 Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ ప్రతిష్టాత్మక 2025 కార్- బైక్ అవార్డ్స్‌లో “ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్” టైటిల్‌ను గెలుచుకుంది. ఈ శక్తివంతమైన ఎస్‌యూవీ కొత్త తరం ఫోర్స్ గూర్ఖాతో పోటీపడుతుంది. థార్ దాని గొప్ప ఫీచర్లతో జ్యూరీని ఆకట్టుకునేలా పోటీలో విజయం సాధించింది. మహీంద్రా ఆఫ్-రోడింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతూ, థార్ రాక్స్ 2024 స్వాతంత్ర దినోత్సవం నాడు రూ.12.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది.
మహీంద్రా థార్ రాక్స్ విడుదల చేసిన మొదటి గంటలోనే 1.80 లక్షల బుకింగ్‌లను సంపాదించి కొత్త రికార్డును సృష్టించింది. ఇది ఈ ఎస్‌యూవీ విపరీతమైన ప్రజాదరణను చూపుతుంది. థార్ రాక్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, రివర్స్ కెమెరా, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇవి మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా సాంకేతికత పరంగా కూడా అభివృద్ధి చెందాయి.
థార్ రాక్స్‌లో ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకమైన 4x4 డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంటెలిజెంట్ టర్న్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, మూడు టెర్రైన్ మోడళ్లు ఉంటాయి. మంచు, ఇసుక, మట్టి ఎలాంటి సవాలుతో కూడిన భూభాగంలోనైనా బాగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది.
మహీంద్రా థార్ రాక్స్ భారత్ NCAP ద్వారా 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించింది, ఇది భారతీయ రోడ్లపై అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రెండూ ఆటోమేటిక్, మాన్యువల్ గేర్‌బాక్స్‌ల ఎంపికతో వస్తాయి. అయితే, 4x4 డ్రైవ్‌ట్రెయిన్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
మహీంద్రా థార్ రాక్స్ అద్భుతమైన ఆఫ్-రోడింగ్ ఫీచర్లతోనే కాకుండా భద్రత, సాంకేతికత, పనితీరు పరంగా కూడా విజయం సాధించింది. ఇది 2025కి "ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్" టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా దాని పట్టు, ప్రజాదరణను మరింత పెంచుకుంది.