ఎలక్ట్రికల్ వెహికల్స్‌పై సబ్సిడీ పెంపు.. తగ్గనున్న ధరలు
Electric Vehicles: ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలనుకుంటున్నా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Electric Vehicles: ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలనుకుంటున్నా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ధరలు తగ్గనున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ సంస్థలకు మరింత ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్ తయారీ ధరలో ప్రస్తుతం 20 శాతం సబ్సిడీ ఉంది. దీనిని 40 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్ అవర్ (kWh) సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ. 15,000 మేరకు సబ్సిడీ అందనుంది. అలాగే 2 kWh బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ లభిస్తోంది. ఈ సబ్సిడీ లక్షన్నర ధర మించని బైకులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది.
ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (FAME) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది.