Maruti Next Gen Dzire: కొత్త డిజైర్ వచ్చేస్తుంది.. 30 కిమీ కంటే ఎక్కువ మైలేజ్.. సిద్ధంగా ఉండండి..!

Maruti Next Gen Dzire: మారుతీ సుజికీ కొత్త డిజైర్‌ను లాంచ్ చేయనుంది. ఫస్ట్ ఈ కారులో హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు.

Update: 2024-08-06 10:38 GMT

Maruti Next Gen Dzire

Maruti Next Gen Dzire: కార్ల తయారీ సంస్థ మారుతీ సుజికీ తన కొత్త డిజైర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారుకు సంబంధించిన అప్‌డేట్స్ నిరంతరం వస్తూనే ఉన్నాయి. కంపెనీ కొత్త డిజైర్‌ను వచ్చే నెలలో విడుదల చేస్తుంది. అయితే దీని లాంచింగ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. టెస్టింగ్ సమయంలో ఈ కారు అనేక సార్లు కనిపించింది. మీరు కూడా కొత్త డిజైర్ కోసం చూస్తున్నట్లయితే దీనికి సంబంధించిన కొన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతీ సుజికీ కొత్త డిజైర్‌ను తక్కువ ధరకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ కారులో జెడ్- సిరీస్ 3 సిలీండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్,112 ఎన్ఎమ్ పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇదే ఇంజన్ మారుతీ స్విఫ్ట్‌లో కూడా ఉంటుంది. ఈ ఇంజన్ మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కానీ ఈ ఇంజన్ కొత్త డిజైర్ కోసం ట్యూన్ చేయబడుతుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజన్ బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. కొత్త డిజైర్ హోండా అమేజ్, టాటా టిగోర్ హ్యుందాయ్ ఆరాలకు పోటీగా నిలవనుంది.

కొత్త డిజైర్‌లో హైబ్రిడ్ టెక్నాలజీని మొదటిసారిగా తీసుకురానున్నారు. అలానే రాబోయే కొద్ది సంవత్సరాల్లో మారుతీ తన అన్ని కార్లను హైబ్రిడ్ చేయనుంది. దీనివల్ల కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉంటుంది. కొత్త డిజైర్ పెట్రోల్, సీఎన్‌జీ రెండింటిలోనూ రానుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ కారు 25 కిలోమీటర్లు, సీఎన్‌జీ మోడ్లో 30 కిమీ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఇది డేటా సోర్స్‌పై ఆధారపడి ఉంటుంది. కొత్త డిజైర్‌లో సింగిల్ సీఎన్‌జీ సిలిండర్ మాత్రమే ఉంటుంది. అయితే టాటా, హ్యుందాయ్ ఇప్పుడు రెండు సీఎన్‌జీ ట్యాంకులను అందిస్తున్నాయి. అయితే వీటిలో సీఎన్‌జీ ట్యాంక్ లేకుండా 378 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ ఉంటుంది. ప్రస్తుతం డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.56 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే కొత్త డిజైర్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

Tags:    

Similar News