Budget 8 Seater Family Cars: మీ ఫ్యామిలీ కోసం కార్ కొనాలా?.. బడ్జెట్‌లో లభించే 8 సీట్ల కార్లు.. ఫీచర్లు పిచ్చెక్కిస్తాయ్..!
Budget 8 Seater Family Cars: ఎంవీపీ కార్లలో ఎక్కువ స్పేస్ ఉంటుంది. 8 నుండి 9 మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు.
Budget 8 Seater Family Cars: ఆటో మార్కెట్‌లో ఎస్‌యూవీలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇప్పుడు వీటికి ఎంవీపీ మోడల్ వాహనాలు గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఎందుకంటే ఇవి మల్టీ పర్పస్ వెహికల్స్. వీటిని బిజినెస్, ట్రాన్స్‌పోర్ట్, ముఖ్యంగా ఫ్యామిలీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగానే ఇవి ఎస్‌యూవీలకు కాంపిటీటర్లగా నిలుస్తున్నాయి. ఎంవీపీ కార్లలో ఎక్కువ స్పేస్ ఉంటుంది. అందువల్ల కుటుంబంతో పాటు ఫుల్ లగేజీతో హాయిగా దూర ప్రయాణాలు చేయవచ్చు. 8 నుండి 9 మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీలో లభించే 8 సీటర్ కార్ల గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki Invicto (మారుతి సుజుకి ఇన్విక్టో)
మారుతి సుజుకి ఇన్విక్టో జీటా+, ఆల్ఫా+ అనే రెండు ట్రిమ్‌లలో వస్తుంది. ఇది 7-8 సీట్ల కాన్ఫిగరేషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. మారుతి సుజుకి ఇన్విక్టో శక్తివంతమైన 2 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 152 PS పవర్, 188 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భారతీయ మార్కెట్లో దీని ధర రూ. 25.21 లక్షల నుండి రూ. 28.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
ఇన్విక్టో 8 సీటర్ ధర గురించి మాట్లాడితే ఇది రూ. 25.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో మీరు 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
Toyota Innova Hycross (టయోటా ఇన్నోవా హైక్రాస్)
టయోటా ఇన్నోవా హైక్రాస్ 8 సీటర్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 19.77 లక్షల నుండి రూ. 30.98 లక్షల మధ్య ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ హైబ్రిడ్ ఇంజన్ 186 PS పవర్, 206 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. అయితే దీని నాన్ హైబ్రిడ్ వెర్షన్ 174 PS పవర్, 205 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో హైబ్రిడ్ ఇంజన్‌తో E-CVT గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. ఇది ADAS, ట్విన్ 10 అంగుళాల వెనుక ప్యాసింజర్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ,పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
Toyota Innova Crysta (టయోటా ఇన్నోవా క్రిస్టా)
ఈ కారుకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. దీని ధర రూ. 19.99 లక్షల నుండి రూ. 26.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది GX, GX ప్లస్, VX, ZX అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇది 7, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. సరికొత్త డిజైన్, సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన 8 సీటర్ టయోటా ఇన్నోవా క్రిస్టాలో 2.4 లీటర్ పవర్ ఫుల్ డీజిల్ ఇంజన్ ఉంది.
ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఇన్నోవా క్రిస్టాలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక AC వెంట్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.