Maruti Baleno Discount: ఆల్టో ధరకే బాలెనో.. ఎన్నడూ చూడని డిస్కౌంట్లు.. టాప్ సెల్లింగ్ కార్ ఇదే..!

Maruti Baleno Discount: మారుతి టాప్ సెల్లింగ్ కారు బాలెనోపై రూ.52 వేల డిస్కౌంట్ ప్రకటించింది.

Update: 2024-09-11 10:01 GMT

Maruti Baleno

Maruti Baleno Discount: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి బాలెనో మొదటి స్థానంలో ఉంటుంది. దీని సూపర్ లుక్, డిజైన్, మైలేజీ కారణంగా బాగా సక్సెస్ అయింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో కూడా బాలెనో నిలిచింది. దీన్ని బట్టి ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. దీనికి పోటీగా కొత్త కార్లు వస్తున్నా.. బాలెనో అమ్మాకాలు తగ్గడం లేదు. ఈ క్రమంలో మీరు ఈ కారును కొనుగోలు చేయాలంటే ఈ నెలలో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బాలెనో దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు, అనేక సంవత్సరాలుగా నంబర్ వన్ స్థానంలో ఉంది. బాలెనో నేరుగా హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌లతో పోటీపడుతుంది. ఈ కారుపై లభించే తగ్గింపుల గురించి తెలుసుకుందాం.

బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ.6.66 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి బాలెనో ధరను రూ. 500, 00 తగ్గించింది. ఇది మాత్రమే కాదు దాని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌పై రూ. 47,100, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 52,100, సిఎన్‌జి మోడల్‌పై రూ. 37,100 తగ్గింపు ఇవ్వబడుతోంది. కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ తగ్గింపు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది.

బాలెనో ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారులో 1.2-లీటర్ K12N పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83bhp పవర్ రిలీజ్ చేస్తుంది. అదే సమయంలో మరొక వేరియంట్ 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్. ఇది 90bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బాలెనో CNGలో కూడా అందుబాటులో ఉంది.

బాలెనో డిజైన్ స్టైలిష్‌గా ఉండడంతో పాటు చాలా మంచి ఫీచర్లు ఇందులో కనిపిస్తున్నాయి. 360 డిగ్రీల కెమెరా, 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ABSతో EBD, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, రివర్సింగ్ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News