High Mileage Cars: దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. లీటర్‌కు ఎంతో తెలిస్తే షాకవుతారు..!

High Mileage Cars: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో లీటర్‌కు 30 కిమీ మైలేజ్ ఇచ్చే కార్లు, స్పెసిఫికేషన్లు.

Update: 2024-09-03 13:19 GMT

High Mileage Cars

High Mileage Cars Under 10 lakhs: దేశంలో ప్రజలు సాధారణంగా కారు కొనుగోలు చేసేటప్పుడు తక్కువ ధర, అధిక మైలేజీని చూస్తారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కార్ల తయారీ కంపెనీలు కూడా తమ ఎంట్రీ లెవల్ విభాగంలో అనేక వాహనాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై 30kmpl కంటే ఎక్కువ మైలేజీని సులభంగా ఇచ్చే కొన్ని వాహనాల గురించి తెలుసుకుందాం. వాటి ధర కూడా రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉంటుంది.

Maruti Celerio
ఈ సెగ్మెంట్ కార్ కంపెనీలు పెట్రోల్, CNG ఇంజిన్ వేరియంట్లను అందిస్తాయి. ఈ జాబితాలో మొదటి కారు మారుతి సెలెరియో. ఈ చౌకైన కారుకు కంపెనీ స్పోర్ట్స్ కారు లాగా కాంపాక్ట్ లుక్ ఇస్తుంది. ఈ కారు వివిధ పెట్రోల్, CNG ఇంజన్ పవర్‌ట్రెయిన్‌లలో 25.17 నుండి 34.43 kmpl వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పెర్కోంది. మారుతి సెలెరియోలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి.

ఈ కారులో పెద్ద కుటుంబానికి సరిపడ 242 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ కారు యూత్ కోసం 7 కలర్ ఆప్షన్స్, స్టార్ట్/స్టాప్ బటన్‌తో వస్తుంది. ఈ కారుకు హై క్లాస్ ఇంటీరియర్ అందించారు. దీనిలో 998 సిసి పవర్ ఫుల్ ఇంజన్ ఉంది. ఈ హై పవర్ కారు రోడ్డుపై గంటకు 150 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు బేస్ మోడల్ రూ.6.52 లక్షలకు ఆన్‌రోడ్‌, టాప్ మోడల్ రూ.8.52 లక్షలకు అందుబాటులో ఉంది.

Maruti Dzire  
మారుతి డిజైర్ కంపెనీకి చెందిన సెడాన్ కారు. ఈ ఫ్యామిలీ కారులో 1.2 లీటర్ పవర్ ఫుల్ ఇంజన్ ఉంది. ఈ కారు పెట్రోల్‌పై 22.41 kmpl, CNGపై 31.12 km/kg మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఈ కారులో నాలుగు విభిన్న వేరియంట్‌లను అందిస్తోంది. ఈ కారులో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, వెనుక సీటులో ఏసీ వంటి ఇతర అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఇది ఐదు సీట్ల కారు. దీని బేస్ మోడల్ రూ. 7.94 లక్షలు, టాప్ మోడల్ రూ. 11.37 లక్షలు. కంపెనీ తన కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను త్వరలో తీసుకురాబోతుంది. ఈ ఫ్యామిలీ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కారు సేఫ్టీ పరంగా 2 స్టార్ (గ్లోబల్ NCAP)రేటింగ్ సాధించింది. కారులో 5 మంది కూర్చోవచ్చు.

Maruti Baleno
మారుతి బాలెనో కంపెనీ కొత్త జనరేషన్ కారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 8.03 లక్షలు, టాప్ మోడల్ రూ. 11.82 లక్షలకు అందుబాటులో ఉంది. కంపెనీ తన 5 సీట్ల కారులో 1197 cc ఇంజిన్‌ను అందించింది. కారులో పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌లు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు CNGలో 22.35 kmpl, CNGలో 30.61 kmpl మైలేజీని ఇస్తుంది.

ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్లను కంపెనీ అందిస్తుంది. ఈ కారులో హెడ్ అప్ డిస్‌ప్లేతో కూడిన 9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది.

Tags:    

Similar News