Kawasaki Discounts: క్రేజీ డీల్స్.. స్పోర్ట్స్ బైక్స్‌పై బిగ్ డిస్కౌంట్స్.. లేట్ చేయకండి..!

Kawasaki Discounts: కవాసకి ఫేమస్ నింజా సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డీల్ సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

Update: 2024-09-04 09:55 GMT

Kawasaki Discounts

Kawasaki Discounts: దేశంలో స్పోర్ట్స్ బైక్స్‌కు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్‌లో రోడ్డపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటే వచ్చే కిక్కే వేరు. ఈ క్రమంలోనే పండుగ సీజన్ ముందు చాలా ఆటో కంపెనీలు తమ వెహికల్స్‌పై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా కవాసకి నింజా కూడా యువ రైడర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫేమస్ నింజా సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డీల్ అనేది సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

కవాసకి ఈ నెలలో తన నింజా సిరీస్‌లోని నింజా 300, నింజా 500, నింజా 650 అనే మూడు మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ తగ్గింపు కింద, మీరు ఈ బైక్‌లపై రూ. 25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ తగ్గింపు వోచర్ రూపంలో అందించబడుతుందని కంపెనీ వెల్లడించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కవాసకి నింజా 500
ఈ ఆఫర్ కింద నింజా 300, నింజా 500 మోడళ్లపై రూ.10,000 డిస్కౌంట్ వోచర్ అందుబాటులో ఉంది. దీనిని బైక్ ఆన్-రోడ్ ధరకు లేదా కవాసాకి డీలర్‌షిప్ వద్ద యాక్సెసరీలు లేదా సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.

2024 కవాసకి నింజా 650
అదేవిధంగా ఈ తగ్గింపు కింద కవాసకి తన నింజా 650పై రూ. 25,000 తగ్గింపు వోచర్‌ను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ వోచర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు రూ. 25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 649 cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 68 hp, 6700 rpm వద్ద 64 Nm టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ మోడల్ ధర ప్రస్తుతం భారతదేశంలో ఎక్స్-షోరూమ్ రూ.7.16 లక్షలు.

కవాసకి నింజా 300
నింజా 300 296 cc సమాంతర-ట్విన్ ఇంజన్ ద్వారా పవర్ సప్లై అవుతుంది. ఇది 11,000 rpm వద్ద 39 hp, అదే rpm వద్ద 26.1 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.43 లక్షలు.

కవాసకి నింజా 500
నింజా 500 451cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 9,000rpm వద్ద 45hp, 6,000rpm వద్ద 42.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.24 లక్షలు.

Tags:    

Similar News