Mahindra Thar: ఫ్యూచర్ ఫవర్‌ఫుల్ ఆఫ్ రోడర్ ఎలా ఉంటుందో తెలుసా.. మహీంద్రా థార్ ఏఐ ఫొటో చూస్తే బాబోయ్ అనాల్సిందే..!
Mahindra Thar AI Picture: మహీంద్రా థార్ భారతదేశంలో అత్యంత ఫవర్ ఫుల్ ఆఫ్‌రోడర్ SUVలో ఒకటిగా నిలిచింది. దీనిని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
Mahindra Thar AI Picture: మహీంద్రా థార్ భారతదేశంలో అత్యంత ఫవర్ ఫుల్ ఆఫ్‌రోడర్ SUVలో ఒకటిగా నిలిచింది. దీనిని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. మహీంద్రా థార్‌లో ప్రతి సంవత్సరం కొత్త అప్‌డేట్‌లు అందిస్తున్నారు. ఈ అప్‌డేల్ కారణంగా, ఇది మునుపటి కంటే మెరుగ్గా మారింది. అయితే, భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే AI సహాయంతో తెలుసుకోవచ్చు. ఏఐ సహాయంతో సోషల్ మీడియాలో థార్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. థార్ ఏలా ఉందో ఓసారి చూద్దాం..
ఫొటోలో కనిపించే మహీంద్రా థార్ అచ్చం థార్‌లానే ఉంది. అయితే, ఇప్పటికీ చాలా మార్పులు ఇందులో కనిపిస్తున్నాయి. విస్తృత టైర్‌లతో పాటు, ఇది శక్తివంతమైన డిజైన్‌ను కూడా అందిస్తుంది. మహీంద్రా థార్ భారతీయ రోడ్లపై వేగంగా దూసుకెళ్లే వాహనంగా పేరుగాంచింది. అయితే, చాలా మంది ప్రజలు దీనిని ఆఫ్-రోడింగ్ కోసం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇది ఏ రకమైన మార్గంలోనైనా నడవగలదు.
కొండలు, కఠినమైన భూభాగం లేదా బురదతో కూడిన రోడ్లలోనూ దూసుకెళ్తుంది. ఎలాంటి రోడ్‌లోనైనా ఈజీగా మార్చేస్తుంది. మహీంద్రా థార్ లోపల ఏ విధమైన సమస్య కూడా లేదు, నీటిలోనూ దూసుకెళ్తుందని చెబుతున్నారు. వేగం, పవర్ గురించి మాట్లాడితే, ఇది చాలా శక్తివంతమైనది. చాలా సులభంగా వేగాన్ని అందుకోగలదు. ఇది ఫోర్ వీల్ డ్రైవ్, టూ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో వస్తుంది.