Bike Tips: రాత్రిపూట మీ బైక్‌ వెంట కుక్కలు పడుతున్నాయా? ఈ ట్రిక్‌ని పాటిస్తే, ఈజీగా తప్పించుకోవచ్చు..!

Dogs Chasing Bike: రైలు భారతదేశ ప్రజా రవాణాకు వెన్నెముకగా పేరుగాంచింది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు కూడా ప్రజల వ్యక్తిగత రవాణాకు చాలా ముఖ్యమైనవి.

Update: 2023-07-20 16:30 GMT

Bike Tips: రాత్రిపూట మీ బైక్‌ వెంట కుక్కలు పడుతున్నాయా? ఈ ట్రిక్‌ని పాటిస్తే, ఈజీగా తప్పించుకోవచ్చు..!

Bike Tips: రైలు భారతదేశ ప్రజా రవాణాకు వెన్నెముకగా పేరుగాంచింది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు కూడా ప్రజల వ్యక్తిగత రవాణాకు చాలా ముఖ్యమైనవి. భారతదేశ జనాభాలో ఎక్కువ మంది వ్యక్తిగత రవాణా కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మోటారు సైకిల్ లేదా స్కూటర్ నడుపుతుంటే, ముఖ్యంగా రాత్రిపూట వాహనాలపై కుక్కలు ఎగబడుతుంటుంటాయి. వీటి వల్ల ఊహించని ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

చాలా కుక్కలు రాత్రిపూట తమ దగ్గరికి వెళ్లే వాహనాన్ని చూసినప్పుడు, అవి మొరుగుతుంటాయి. దీంతో కార్ల యజమానులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కుక్కలు కరిచివేస్తాయన్న భయంతో ద్విచక్ర వాహనదారులు భయపడే అవకాశం ఉంది. మీరు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భవిష్యత్తులో అలా జరగకూడదని కోరుకుందాం.

దీన్ని నివారించడానికి, మీరు ఒక ఉపాయం పాటించవచ్చు. అయితే, ఈ ఉపాయం చెప్పే ముందు, అసలు రాత్రిపూట వాహనాలపై కుక్కలు ఎందుకు మొరుగుతాయో తెలుసుకుందాం. నిజానికి, కుక్కలు తమ దగ్గరికి అతివేగంతో వస్తున్న వాహనాన్ని చూసినప్పుడు రెచ్చిపోతాయి. దీని కారణంగా అవి మొరుగుతూ, వావానాల మీదకు వస్తుంటాయి.

కాబట్టి, రాత్రిపూట మీ వాహనంపై కుక్కలు దాడి చేయకూదడనుకుంటే.. తక్కువ వేగంతో జాగ్రత్తగా వాటిని దాటాలి. మీరు తక్కువ వేగంతో వెళ్తే, కుక్క మొరగకుండా ఉండటానికి చాలా అవకాశం ఉంది. అయితే వాహనం స్లో అయినప్పుడు కూడా కుక్క మొరిగితే భయపడకుండా వాటిని కాస్త భయపెట్టేందుకు ప్రయత్నించాలి.

ఆ తర్వాత, బైక్‌ను నెమ్మదిగా ముందుకు కదిలించి, అక్కడ నుంచి బయలుదేరాలి. దీంతో కుక్కలు వెనుదిరిగి పోతుంటాయి. అయితే, ఈ ట్రిక్ తప్పనిసరిగా ప్రతిసారీ పని చేయదు. అందుకే, జాగ్రత్తగా ఉండాలి.

Tags:    

Similar News