Cheapest Hatchback: రూ. 6 లక్షలలోపే.. 34 కిమీల మైలేజీ.. చిన్న కుటుంబాలకు 5 బెస్ట్ కార్లు ఇవే..!

Cheapest Hatchback: ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు చిన్న కుటుంబాలకు అత్యంత అనుకూలమైనవిగా పరిగణిస్తుంటారు.

Update: 2024-09-05 12:18 GMT

Cheapest Hatchback: రూ. 6 లక్షలలోపే.. 34 కిమీల మైలేజీ.. చిన్న కుటుంబాలకు 5 బెస్ట్ కార్లు ఇవే..!

Cheapest Hatchback: ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు చిన్న కుటుంబాలకు అత్యంత అనుకూలమైనవిగా పరిగణిస్తుంటారు. ఈ తక్కువ బడ్జెట్ కార్లు వాటి మెరుగైన మైలేజీకి, ఆర్థిక నిర్వహణకు ప్రసిద్ధి చెందాయి. కుటుంబానికి సరిపోయేలా ఉండడంతో అంతా వీటిపైనే మోజు పడుతున్నారు. కేవలం ధరలోనే కాదు మైలేజీలోనూ ఇవి అబ్బురపరుస్తున్నాయి. అలాంటి ఎంట్రీ లెవల్ కార్లను ఇప్పుడు చూద్దాం.

1. మారుతీ వ్యాగన్ ఆర్:

మారుతి వ్యాగన్ఆర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది, 1 లీటర్, 1.2 లీటర్ ఆప్షన్. దీని పెట్రోల్ వేరియంట్ 24 కిమీ మైలేజీని ఇస్తే.. సీఎన్‌జీ వేరియంట్ 34 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 5.54 లక్షలుగా ఉంది.

2. మారుతి సెలెరియో:

మారుతి సెలెరియోలో, కంపెనీ 1 లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌ను ఉపయోగించింది. దీని పెట్రోల్ వేరియంట్ 25 కిమీల వరకు, CNG వేరియంట్ 34 కిమీల వరకు మైలేజీని ఇస్తుంది. మారుతీ సెలెరియో ధర రూ.5.37 లక్షలుగా ఉంది.

3. రెనాల్ట్ KWID:

రెనాల్ట్ క్విడ్ 1 లీటర్ కెపాసిటీ గల ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ కారు కేవలం ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. సాధారణంగా ఈ కారు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. రెనాల్ట్ KWID ధర రూ.4.70 లక్షలుగా ఉంది.

4. మారుతి ఎస్ ప్రెస్సో:

మారుతి S-ప్రెస్సో దాని SUV రూపానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 1 లీటర్ కెపాసిటీ గల ఇంజన్ కూడా ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ 24 కిమీల మైలేజీని, సీఎన్‌జీ వేరియంట్ 34 కిమీల మైలేజీని ఇస్తుంది. మారుతి ఎస్ ప్రెస్సో ధర రూ.4.26 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

5. మారుతి ఆల్టో k10

మారుతి ఆల్టో కె10 దేశంలోనే అత్యంత చౌకైన కారుగా పేరుగాంచింది. ఇందులో 1 లీటర్ కెపాసిటీ ఇంజన్ ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ 24 కిమీల మైలేజీ ఇస్తుండగా.. సీఎన్‌జీ వేరియంట్ 33 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది. మారుతి ఆల్టో k10 ధర విషయానికి వస్తే రూ. 3.99 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

Similar News