నంబర్ ప్లేట్‌ ద్వారా వెహికిల్‌ వివరాలు తెలుసుకోండి.. ఈ విధంగా చేయండి..!

How to Get Vehicle Details: కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై యాక్సిడెంట్‌ చేసి స్పీడ్‌గా వెళ్లిపోతారు. ఇలాంటి సమయంలో వెహికిల్‌ నంబర్‌ గుర్తుంటే వాహన యజమానిని సులభంగా తెలుసుకోవచ్చు.

Update: 2023-08-26 10:59 GMT

నంబర్ ప్లేట్‌ ద్వారా వెహికిల్‌ వివరాలు తెలుసుకోండి.. ఈ విధంగా చేయండి..!

How to Get Vehicle Details: కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై యాక్సిడెంట్‌ చేసి స్పీడ్‌గా వెళ్లిపోతారు. ఇలాంటి సమయంలో వెహికిల్‌ నంబర్‌ గుర్తుంటే వాహన యజమానిని సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు వాహనానికి సంబంధించిన ఇతర సమాచారం కూడా తెలుస్తుంది. వెహికిల్‌ నంబర్‌ ద్వారా యజమాని సమాచారాన్ని సేకరించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి SMS ద్వారా తెలుసుకోవచ్చు. రెండోది థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ రెండు పద్ధతుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

SMS ద్వారా సమాచారం

SMS ద్వారా సమాచారం తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం కోసం మీరు ఒక నంబర్‌ని నోట్ చేసుకోవాలి. దీంతో ఇంట్లో కూర్చొని SMS ద్వారా వాహన యజమాని పేరును సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్‌లో 7738299899 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. తర్వాత SMS పంపడానికి వాహనం నంబర్‌ను VAHAN తర్వాత స్పేస్‌ ఇచ్చి (వాహన్ <స్పేస్> వాహనం నంబర్) పైన పేర్కొన్న నంబర్‌కు పంపాలి.

తర్వాత మీకు అవసరమైన సమాచారాన్ని పొందే మెస్సేజ్‌ వస్తుంది. ఇందులో వెహికిల్‌ యజమాని పేరు, RTOలో నమోదు చేసిన తేది, వెహికిల్‌ మొదటి యజమాని, లేదా రెండవ యజమాని పేరు, వెహికిల్‌ మోడల్ మొదలైన వివరాలు లభిస్తాయి.

థర్డ్-పార్టీ యాప్‌ల సహాయం

వాహనం యజమాని పేరును తెలుసుకోవడానికి కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు కూడా ఉన్నాయి.

Google Play Store, Apple App Storeలో అనేక యాప్‌లు ఉన్నాయి. ఇవి మీకు అవసరమైన వివరాలను అందించడంలో సహాయపడతాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే థర్డ్ పార్టీ యాప్‌లను గుడ్డిగా నమ్మవద్దు. ఇవి అనేక రకాల అనుమతులు అడుగుతాయి. డేటా లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిజోలికి పోవకపోవడమే ఉత్తమం.

రవాణా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ నుంచి వివరాలు పొందవచ్చు.

స్టెప్ 1: ముందుగా బ్రౌజర్‌లో రవాణా వెబ్‌సైట్ vahan.parivahan.gov.inని ఓపెన్‌ చేయాలి.

స్టెప్ 2: మెనులో ‘ఇన్ఫర్మేషన్‌ డిటైల్స్‌’పై నొక్కి ' నో ద వెహికిల్ డిటైల్స్‌ ’పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: ఇప్పుడు మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDతో అకౌంట్‌ క్రియేట్‌ చేయాలి.

స్టెప్ 4: మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేసి కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేయాలి.

స్టెప్ 5: పాస్‌వర్డ్‌ని సృష్టించిన తర్వాత రవాణా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 6: ఇప్పుడు ఇక్కడ చెక్‌ చేయాలనుకుంటున్న వాహనం నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. తదుపరి పేజీలో మీరు వాహనం అన్ని వివరాలను పొందుతారు.

Tags:    

Similar News