Ola Electric Auto: సంచలనం.. ఓలా నుంచి బడ్జెట్ ఎలక్ట్రిక్ ఆటో.. ఫీచర్లు, మైలేజ్ చూస్తే షాకే..!

Ola Electric Auto: ఓలా ఎలక్ట్రిక్ బడ్జెట్ ప్రైస్‌లో ఆటో రిక్షాను విడుదల చేయనుంది. ఇది వపర్ ఫుల్ బ్యాటరీతో ఎక్కువ రేంజ్ ఇస్తుంది.

Update: 2024-09-06 13:43 GMT

Ola Electric Auto

Ola Electric Auto: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల తర్వాత ఇప్పుడు తన ప్లాన్ ఎంటో బయటకు వచ్చింది. కంపెనీ కమర్షియల్‌ వెహికల్‌ సెగ్‌మెంట్‌లోనూ పట్టు పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంట్‌రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ కొత్త వాహనం ప్రస్తుతం ఉన్న ఇతర ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లతో పోలిస్తే ఎక్కువ స్థలాన్ని, మెరుగైన సౌకర్యాలను అందిస్తుంది, కొత్త మోడల్ పేరు 'రాహి' కావచ్చు. కొత్త ఎలక్ట్రిక్ ఆటో, డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అప్‌గ్రేడ్‌గా ఉండే అవకాశం ఉంది. ఓలా రాహీ ఇ-ఆటోమొదటిసారిగా కర్ణాటకలోని బెంగళూరులో టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Ola Auto Design
ఓలా కొత్త రాహి ఎలక్ట్రిక్ ఆటో డిజైన్‌లో స్టైలిష్, మోడ్రన్ లుక్‌తో వస్తుంది. కర్ణాటకలోని బెంగుళూరులో మొదటిసారిగా ఓలా రాహిని పరీక్షించినప్పుడు ఇతర ఆటో రిక్షాల నుండి చాలా భిన్నంగా కనిపిస్తుంది. Ola ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో అనేక పేటెంట్ డిజైన్‌లను పరీక్షించేటప్పుడు గుర్తించబడిన మోడల్ గురించి ఇక్కడ కొంత సమాచారం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 3W వాహనాలకు భిన్నంగా కనిపిస్తుంది.

Ola Auto Features
రాహి పేరుతో రానున్న ఓలా ఎలక్ట్రిక్ ఆటో అధిక కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అయితే ప్రస్తుతానికి ఎంత రేంజ్‌లో ఉంటుందనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. కొత్త రాహీలో పవర్ ఫుల్ మోటర్ ఉంటుంది, ఇది అధిక వేగంతో నడపడానికి వీలు కల్పిస్తుందని చెబుతున్నారు. ఛార్జింగ్ గురించి మాట్లాడితే కొత్త రాహిని ఇంట్లో లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లలో సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

క్యాబిన్ గురించి చెప్పాలంటే కొత్త రాహి క్యాబిన్, దాని సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే ఇందులో మంచి స్పేస్ కూడా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ రాహి అధికారిక లాంచ్ తేదీని వెల్లడించలేదు. అయితే ఇది ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందుని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ రాహి విడుదల భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బలమైన పోటీని సృష్టిస్తుంది.

Tags:    

Similar News