Driving License Cancel: ఇదేం రూల్ సామీ.. ఈ లైట్ తప్పుగా వాడితే లైసెన్స్ క్యాన్సిల్..!
Driving License Cancel: ఈ ఏడు తప్పులు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫాగ్ లైట్లను దుర్వినియోగం చేస్తే లైసెన్స్ రద్దు కూడా అవుతుంది.
Driving License Cancel: డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏ వ్యక్తికైనా డ్రైవింగ్ చేసే హక్కును కల్పిస్తుంది. అయితే ఈ హక్కు కొన్ని షరతులతో వస్తుంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చాలా వరకు ట్రాఫిక్ చలాన్ రూపంలో జరిమానా విధించబడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ కావచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇలా జరుగుతుందో తెలుసుకుందాం.
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడానికి కొన్ని ప్రధాన కారణాలు
1. తాగి డ్రైవింగ్ చేయడం
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడానికి ఇది చాలా సాధారణ కారణం. మద్యం సేవించి వాహనాలు నడపడం మీకే కాదు ఇతరులకు కూడా ప్రమాదకరం.
2. ఓవర్ స్పీడ్
అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం కూడా తీవ్రమైన నేరం, రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. మీరు నిరంతరం అతివేగంగా వాహనాన్ని నడిపినట్లయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడే అవకాశం ఉంది.
3. రెడ్ లైట్ జంప్
రెడ్ లైట్ జెంప్ చేయడం కూడా తీవ్రమైన నేరం. దీంతో ఇతర వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. మీరు ఈ విధంగా పదేపదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ DL నిలిపివేయబడుతుంది లేదా రద్దు చేయబడుతుంది.
4. ఫాగ్ లైట్లను తప్పుగా ఉపయోగించడం
పొగమంచు లేదా వర్షం సమయంలో మాత్రమే ఫాగ్ లైట్లను ఉపయోగించాలి. దీన్ని దుర్వినియోగం చేస్తే లైసెన్స్ రద్దు కూడా అవుతుంది.
5. మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం కూడా తీవ్రమైన నేరం. ఇది మీ దృష్టిని మరల్చుతుంది. ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నేరానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది.
6. ఉద్దేశపూర్వకంగా ఇతర వాహనాలకు నష్టం
ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరొక వాహనానికి నష్టం కలిగిస్తే అతని లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది.
7. ట్రాఫిక్ నిబంధనలు
భారతదేశంలో రోడ్లపై క్రమశిక్షణ పెంచడానికి ట్రాఫిక్ నియమాలు అమలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు లైసెన్స్ రద్దు చేస్తారు. ఎవరైనా రాంగ్ లేన్‌లో డ్రైవింగ్ చేసినా లేదా తప్పుడు పద్ధతిలో ఓవర్‌టేక్ చేసినా అతనిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు.
మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
తీవ్రమైన నేరాలకు సంబంధించి మీరు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవచ్చు. మీ లైసెన్స్ రద్దు చేయబడితే మీరు అధిక బీమా ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఒక బాధ్యతగా పరిగణించాలి. దానిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా మీ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.