Top 5 Best Selling Cars: టాటా పంచ్‌, హ్యుందాయ్ క్రెటాలకు ఘోర ఓటమి.. నంబర్ స్థానానికి దూసుకెళ్లిన మారుతి బ్రెజా..!

Top 5 Best Selling Cars: అమ్మకాల్లో క్రెటా, టాటా పంచ్‌లను బ్రెజ్జా క్రాస్ చేసి నంబర్ వన్‌గా నిలిచింది. త్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్లు ఇవే.

Update: 2024-09-07 12:05 GMT

Top 5 Best Selling Cars

Top 5 Best Selling Cars: దేశంలో గత కొన్నేళ్లుగా కార్ల మార్కెట్ వేగంగా దూసుకెళ్తుంది. కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి త్రైమాసికంలోనూ అమ్మకాలు పెరగడం కనిపిస్తుంది. ఆటో కంపెనీలు బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ మోడళ్ల వరకు రకరకాల వేరియంట్లును అందిస్తున్నాయి. దేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ SUV విభాగాల కార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కార్ల కంపెనీలు కూడా తమ విక్రయ నివేదికలను విడుదల చేశాయి. ఈసారి మారుతీ సుజుకీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. క్రెటా, పంచ్ వెనుకబడ్డాయి. కాబట్టి అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మకాల విషయంలో ఎవరు ఎవరి కంటే ముందున్నారో చూద్దాం.

Maruti Brezza
ప్రస్తుతం మారుతీ సుజుకి బ్రెజా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. గత నెల (ఆగస్టు 2024), 19,190 యూనిట్ల బ్రెజ్జా విక్రయించగా గత ఏడాది ఆగస్టు నెలలోనే మొత్తం 14,572 యూనిట్ల బ్రెజ్జా సేల్ అయింది. ఈసారి బ్రెజ్జా విక్రయాల్లో విపరీతమైన వృద్ధి నమోదైంది. అమ్మకాల పరంగా హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్‌లను బ్రెజ్జా ఘోరంగా ఓడించింది.

4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న బ్రెజ్జా దాని విభాగంలో అత్యంత విలాసవంతమైన SUVగా కూడా పరిగణించబడుతుంది. ఇది అత్యంత సౌకర్యవంతమైనది కూడా. ఇందులో అమర్చిన పవర్ ఫుల్ ఇంజన్ మైలేజ్ పరంగా కూడా అగ్రస్థానంలో ఉంది. పెట్రోల్‌తో పాటు, మీరు బ్రెజ్జాలో CNG ఎంపికలో కూడా కొననుగోలు చేయవచ్చు. మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.34 లక్షలు.

Maruti Suzuki Ertiga
మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పటికీ కుటుంబానికి ఇష్టమైన MPV. గత నెలలో ఎర్టిగా అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత నెలలో 18,580 యూనిట్ల ఎర్టిగా విక్రయాలు జరిగాయి. కాగా ఈ ఏడాది జూలైలో ఎర్టిగాను 15,701 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే ఈసారి ఈ వాహనానికి డిమాండ్ పెరిగింది. ఇది శక్తివంతమైన ఇంజన్, పెద్ద స్థలానికి ప్రసిద్ధి చెందిన 7 సీట్ల కారు.

Hyundai Creta
టాప్ 5 బెస్ట్ కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా మూడో స్థానానికి చేరుకుంది. గత నెలలో క్రెటా 16,762 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైలో క్రెటాను 17,350 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది మధ్యతరహా SUV, ఇది కుటుంబ తరగతి నుండి యువతకు అత్యంత ఇష్టమైన కారు.

Maruti Wagon R
వ్యాగన్ఆర్ అమ్మకాలు ఎప్పుడూ తగ్గవు. గత ఆగస్టులో 16,450 యూనిట్ల వ్యాగన్ఆర్ విక్రయించగా ఈ ఏడాది జూలైలో 16,191 యూనిట్ల వ్యాగన్ఆర్ విక్రయించి టాప్ 10 కార్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ కారులో స్థలం కొరత లేదు.

Tata Punch
భారతదేశంలో టాటా పంచ్ విక్రయాలు నిరంతరం తగ్గుతున్నాయి. అగ్రస్థానంలో ఉన్న ఈ కారు ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుంది. టాటా పంచ్ గత నెలలో 15,643 యూనిట్లను విక్రయించింది. కాగా ఈ ఏడాది జూలైలో ఈ చిన్న టాటా ఎస్‌యూవీని 16,121 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది బలమైన SUV.

Tags:    

Similar News