EV Scooter: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. అమాంత్రం పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఎంతంటే?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం ప్రారంభించాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది.
EV Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం ప్రారంభించాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. మార్చి 31, 2024న, FAME-2 సబ్సిడీ పథకం ముగిసిందని తెలిసిందే. దీని స్థానంలో ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) అమలులోకి వచ్చింది.
ఈ కారణంగా, Ather, TVS, Vida, Bajaj సహా అనేక ఇతర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు ధరను 16,000 రూపాయల వరకు పెంచాయి. అయితే, ఓలా ఎలక్ట్రిక్ ధర పెంపును ప్రకటించలేదు. ప్రస్తుతం, కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను పండుగ ఆఫర్‌లో విక్రయిస్తోంది.
EMPS కింద ఎంత సబ్సిడీ ఇస్తుంది?
ఎమ్మార్పీ కింద ప్రభుత్వం రూ.500 కోట్ల సబ్సిడీ నిధిని సిద్ధం చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, ఎలక్ట్రిక్ త్రీవీలర్, ఈ-రిక్షాలపై కొత్త సబ్సిడీని నిర్ణయించారు. ప్రస్తుతానికి, ఇందులో ఎలక్ట్రిక్ 4-వీలర్లను చేర్చడం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
కొత్త పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి సబ్సిడీ రూ.22,500 నుంచి రూ.10,000కు తగ్గించారు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఈ-రిక్షాలకు సబ్సిడీని రూ.25,000గా నిర్ణయించారు. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు సబ్సిడీని రూ.50,000గా నిర్ణయించారు.