Citroen C3 Turbo AT: సిట్రోయెన్ C3 అప్‌డేట్ వెర్షన్.. రోడ్లపై దూసుకుపోతుంది..!
Citroen C3 Turbo AT: సిట్రోయెన్ ఇప్పుడు అప్‌డేటెడ్ C3 ఆటోమేటిక్ వేరియంట్ విడుదల చేసింది. దీని ధరలు, ఫీచర్లు ఇవే.
Citroen C3 Turbo AT: ప్రజలు ఇప్పుడు భారతదేశంలో చాలా ఆటోమేటిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు సరసమైన ధరలకు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. పండుగ సీజన్ ప్రారంభం కానుంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిట్రోయెన్ ఇప్పుడు అప్‌డేటెడ్ C3 ఆటోమేటిక్ వేరియంట్‌ల ధరలను వెల్లడించింది. ఇది టాప్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశంలో దీని పోటీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార్లతో ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Citroen C3 ఆటోమేటిక్ వేరియంట్ ధర
టర్బో షైన్ ఏటీ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు
టర్బో షైన్ ఏటీ వైబ్ ప్యాక్ వేరియంట్ ధర రూ. 10.12 లక్షలు
టర్బో షైన్ AT Dual Tone వేరియంట్ ధర రూ.10.15 లక్షలు
టర్బో షైన్ ఎటి డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ వేరియంట్ ధర రూ. 10.27 లక్షలు
ఇంజిన్, పవర్
కొత్త C3లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 110 Nm పవర్, 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా ఈ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. మీరు దీన్ని 6 స్పీడ్ మాన్యువల్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. అంటే మీరు మీ అవసరాన్ని బట్టి మోడల్‌ను ఎంచుకోవచ్చు.
టాప్ ఫీచర్లు
సిట్రోయెన్ C3 డిజైన్ కొంచెం స్పోర్టీగా, కొంచెం స్టైలిష్‌గా ఉంటుంది. ఇది LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల వింగ్ మిర్రర్లు, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. దీని టర్బో AT కూడా MyCitroen Connect స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని కలిగి ఉంది.
భారతదేశంలో అప్‌డేటెడ్ సిట్రోయెన్ C3 నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెంట్‌తో పోటీపడుతుంది. కానీ రెండూ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తాయి. మీరు కొత్త SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు Citroen C3ని బుక్ చేయవచ్చు.