Best compact SUVs: కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో హాట్ కేకులు.. కొనేందుకు క్యూ కడుతున్న జనాలు.. ఎందుకంటారు..?

Best compact SUVs: ఆటోమొబైల్ మార్కెట్‌లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు. బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. రూ. 5 లక్షలకే కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-26 10:54 GMT

Best compact SUVs

Best compact SUVs: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీల మధ్య ఓ చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తుండటంతో ఎస్‌యూవీలను పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నాయి. ఎస్‌యూవీల జోరుకు ఇప్పట్లో బ్రేక్‌లు పడేలాలేవు. ఫ్యామిలీతో ట్రిప్‌లకు వెళ్లే వారికి ఇవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న కార్లకు మార్కెట్‌లో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో తక్కువ బడ్జెట్‌లో లభించే ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.

Renault Kiger
కాంపాక్ట్ SUV కిగర్ ఒక గొప్ప కారు. ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 405 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది. ఇది స్టైలిష్ కాంపాక్ట్ SUV. దీనికి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఉంది. ఇంజన్ గురించి మాట్లాడితే ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 72PS పవర్, 96Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. అలానే ఇందులో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 100PS పవర్, 160Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లకు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉంటుంది. భద్రత కోసం EBDతో కూడిన ABS, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Nissan Magnite
నిస్సాన్ మాగ్నైట్ ఒక మంచి కాంపాక్ట్ SUV. ఇందులో రెండు పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 70 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. అయితే దాని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 97 bhp పవర్, 160 Nm టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటాయి. అయితే టర్బో పెట్రోల్ ఇంజన్‌లో సివిటి గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ఇందులో లగేజీని ఉంచేందుకు 336 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది EBD తో ABS, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Hyundai Exter
హ్యుందాయ్ EXTER ఒక కాంపాక్ట్, స్టైలిష్ కాంపాక్ట్ SUV. ఇందులో 1.2L కప్పా పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83 PS పవర్,113.8 Nm టార్క్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 19.4 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. CNG మోడ్‌లో 27.1 km/kg మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్సెటర్ 391 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tata Punch
టాటా పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 86 PS పవర్ మరియు 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 20.1 KM/L మైలేజీని అందిస్తుంది. CNG మోడ్‌లో ఇది 27.1 km/kg మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం, ఇది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు EBD మరియు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఇందులో లగేజీని ఉంచేందుకు 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 6.12 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News