జీఓ–81తో ప్రయోజనమే : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Update: 2019-11-11 02:28 GMT

ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.. ఇందుకోసం జీఓ–81 కూడా ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ జీవో ను తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల తెలుగుజాతికే ముప్పని వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు అధికార బాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. దీనిపై మాట్లాడుతూ..

ప్రభుత్వం విడుదల చేసిన జీఓ–81తో పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దీని వల్ల సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఓక్‌రిడ్జ్‌ పాఠశాలల్లో సైతం తెలుగుభాషకు స్థానం ఉంటుందన్నారు. ప్రజల అభ్యర్థన మేరకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడుతున్నారని స్పష్టం చేశారు. దీనిని అందరూ ఆహ్వానించాలని కోరారు. 

Tags:    

Similar News