జగన్ ఆస్తుల కేసు తుది దశకు చేరింది: యనమల రామకృష్ణుడు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2020-02-14 07:55 GMT
Yanamala Ramakrishnudu File Photo

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ దాడులకు జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడమే జగన్ లక్ష్యమని ఆరోపిచారు. కేసుల నుంచి సీఎం తప్పించుకోవడానికి ఎదుటివాళ్లపై విమర్శలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఐటీ దాడుల సాకుతో టీడీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖడిస్తున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 - 15 మంది పీఎస్‌, పీఏలుగా పనిచేశారని తెలిపారు.

రివర్స్‌ టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చిన ఇన్‌ఫ్రా కంపెనీపై దాడికి టీడీపీకి సంబంధం ఏమిటో జగన్ చెప్పాలన్నారు. హైకోర్టులో సీబీఐ పిటిషన్‌పై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాంట్రాక్టులు ఐటీ సోదాలు జరిగిన ఇన్‌ఫ్రా కంపెనీకే ఇవ్వలేదా అని యనమల నిలదీశారు. నైతిక హక్కుల గురించి వైసీపీ మాట్లాడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నైతిక హక్కు గురించి 16 నెలలు జైలు జీవితం గడిపి 16 చార్జిషీట్‌లు ఉన్న వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీపై జగన్ మీడియా, వైసీపీ నేతలు విష ప్రచారం చెస్తున్నారని, వీళ్ల విష ప్రచారం అసత్యలు మానుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జగన్‌ రూ.43వేల కోట్ల ఆదాయనికి మించిన ఆస్తుల కేసు విచారణ తుది దశకు చేరిదని.. ఈడీ జగన్‌ రూ.4వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిందని వెల్లడించారు. జగన్ శిక్ష తప్పదని తెలిసే కోర్టులో జరిగే ట్రయిల్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీపై ఫిర్యాదుల కోసమే విజయసాయిరెడ్డికి ఎంపీని చేశారని ఆరోపించారు. విజయసాయి రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందని విమర్శించారు. జగన్‌ బోగస్ కంపెనీల సృష్టికర్త కూడా విజయ సాయిరెడ్డి అని అన్నారు.

  

Tags:    

Similar News