విశాఖలో టీడీపీకి షాక్.. కీలక నేత వైసీపీలోకి

విశాఖలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అద్యక్షపదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు.

Update: 2019-12-26 06:05 GMT

విశాఖలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అద్యక్షపదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో రెహమాన్ వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. విశాఖను రాజధానిగా చేయడానికి టీడీపీ ఒప్పుకోకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో టీడీపీ వైఖరి కారణంగానే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. వాస్తవానికి గతకొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పట్ల రెహమాన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఆయన ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేయడంతో చర్చనీయాంశం అయింది. ఎన్నికల ముందు వరకు పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను తప్పించి రెహమాన్ను నియమించారు.

గడిచిన ఎన్నికల్ల విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును రెహ్మన్ తనకు లేదా తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేశారు. అయితే బాబు.. గణేష్ కు తిరిగి దక్షిణ సీటు ఇచ్చి.. నగర పార్టీ బాధ్యతల నుంచి గణేష్ ను తప్పించి ఆ పదవి రెహమాన్ కు ఇచ్చారు. దాంతో సీటు రాకపోవడంతో రెహమాన్ టీడీపీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెహమాన్ సతీమణి కలిశారు.

Tags:    

Similar News