నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలివే..

Update: 2019-11-27 02:16 GMT

ఇవాళ(బుధవారం) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో డిసెంబర్ 1 నుంచి మార్చి నెల వరకు ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణి, ప్రస్తుతం జరుగుతున్న సాగునీటి ప్రోజెక్టుల పనులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. అలాగే రాజధాని పరిధి సీఆర్‌డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి.. వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశంఉంది.

టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానే కేబినెట్‌లో ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్‌ ఫీజుల కింద ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపనుంది క్యాబినెట్. 

Tags:    

Similar News