ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా జంప్ అవుతారా?

ఏపీలో ప్రస్తుతం కొత్తరకం వలసల రాజకీయం నడుస్తోంది. పార్టీ కండువా కప్పుకోకున్నా, సభ్యత్వం తీసుకోకుండా బేషరతుగా అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు.

Update: 2020-01-01 11:01 GMT

ఏపీలో ప్రస్తుతం కొత్తరకం వలసల రాజకీయం నడుస్తోంది. పార్టీ కండువా కప్పుకోకున్నా, సభ్యత్వం తీసుకోకుండా బేషరతుగా అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు. టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, ముద్దాలి గిరిధర్, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లు బహిరంగంగానే అధికార వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. ఆ కోవలో మరో ఎమ్మెల్యే కూడా చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మరో వారంపదిరోజుల్లో ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించవచ్చని ఆ ప్రచార సారాంశం. అందుకు తగ్గట్టే రవి కూడా టీడీపీ తో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని.. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వైసీపీలో చేరతారని ప్రకాశం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరడానికి కూడా ఒక కారణం ఉందట.. రవి కుటుంబసభ్యులకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. దాంతో ఈ దాడులను ఆపేందుకు ఎమ్మెల్యే రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. కానీ ఆశించిన మేర ఆపలేకపోతున్నారట. వైసీపీలో చేరితే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన పార్టీ మారడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు టాక్ వినబడుతోంది. మరో ఏమి జరుగుతోందో చూడాలి. 

Tags:    

Similar News