ఆర్టీసీ చార్జీలు పెంపుదల నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన

ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన చేపట్టారు.

Update: 2019-12-12 08:13 GMT
పార్టీ ఇన్ చార్జ్ యనమల కృష్ణుడు

తుని : ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ యనమల కృష్ణుడు నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. మార్కెట్ యార్డ్ సెంటర్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ సూరవరం రోడ్, ఆంజనేయ స్వామి గుడి, బాలికోన్నత పాఠశాల, మెయిన్ రోడ్డు, గొల్ల అప్పారావు సెంటర్, రైల్వే స్టేషన్, ఫ్లై ఓవర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకున్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై పెనుభారం పడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఆర్టీసీ ఛార్జీల పెంపు మరింత భారం అవుతుందన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News