విజయనగరంలో 100 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రికి శంకుస్థాపన

Update: 2019-12-20 02:10 GMT

విజయనగరంలో ఇఎస్‌ఐసి (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఆసుపత్రికి పునాదిరాయి వేశారు. ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ .75.26 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శంకుస్థాపన చేశారు.. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాని హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం, భద్రతకు ఎన్‌డిఎ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అలాగే దేశంలోని కార్మికులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ మరియు సేవలను అందించడానికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేంద్ర మంత్రి వివరించారు. ESIC ఆసుపత్రులలో వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

మరోవైపు విశాఖపట్నంలో త్వరలో 500 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూర్ జయరామ్ అన్నారు. మెరుగైన చికిత్స కోసం వైజాగ్ వెళ్లవలసిన అవసరం లేదని విజయనగరంలోని కార్మికులకు ఈ ఆసుపత్రి ఒక వరంలా మారుతుందని అవుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. కాగా ఈ ఆసుపత్రి రెసిడెన్షియల్ క్యాంపస్‌తో సహా G + 2 భవనాలు ఉంటాయి. OPD, వార్డులు, ల్యాబ్‌లు అత్యవసర సదుపాయాల వంటి అన్ని ఆధునిక వైద్య సదుపాయాలను ఉంటాయి. ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు. నిర్మాణం తరువాత, దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఈ కార్యక్రమానికి కార్మిక, ఉపాధి శాఖ ప్రధాన కార్యదర్శి బి ఉదయ లక్ష్మి, జిల్లా కలెక్టర్ ఎం హరిజవహర్ లాల్ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News