ట్రాక్టర్ తో పిచికారి కూలీల కొరత తీర్చే దారి

శనగ పంట సాగు మొదలుకొని పంటకాలం ముగిసే వరకు వివిధ దశల్లో ఐదుసార్లు పురుగుల మందు పిచికారి చేయాలి ఉంటుంది.

Update: 2019-11-28 05:45 GMT
పురుగుల మందు పిచికారీ చేస్తున్న ట్రాక్టర్

సింహాద్రిపురం: శనగ పంట సాగు మొదలుకొని పంటకాలం ముగిసే వరకు వివిధ దశల్లో ఐదుసార్లు పురుగుల మందు పిచికారి చేయాలి ఉంటుంది. ఈ క్రమంలో కూలీలతో ఈ పనులు చేయించాలంటే అధిక మొత్తం వ్యయం చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు కూలీల కొరత కూడా అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రస్తుతం సింహాద్రిపురం మండలం లోని రైతుల ట్రాక్టర్ల మందులను పిచికారి చేసి యంత్రాలు అమర్చి వాటి ద్వారా పంటపొలాల్లో పురుగుల మందులు పిచికారి చేస్తున్నారు.

ఈ విధానం వల్ల రోజుకు వంద ఎకరాలకు పైగా మందు పిచికారి చేయగలుగుతున్నారు. ఈ విధానం ట్రాక్టర్ ను నడిపే చోదకుడు మినహా ఇతర కూలీల అవసరం లేకపోవడంతో ఖర్చులు ప్రయాస తగ్గాయని అన్నదాతలు చెబుతున్నారు. 



Tags:    

Similar News