ఆనందపురంలో సొంతంగా సోలార్‌ పవర్‌ తయారీ

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Update: 2020-01-17 06:48 GMT

ఆనందపురం: ఆనందపురం మండలం గంభీరం ఏపీఐఐసీ పరిశ్రమల సముదాయంలో ఉన్న సమీర (విద్యుదయస్కాంత పర్యావరణ ప్రభావాల కేంద్రం, అనువర్తిత సూక్ష్మ తరంగాల ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థ) సోలార్‌ విద్యుత్తు వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. సోలార్‌ విద్యుత్తు వినియోగించడమే కాకుండా ఏపీ ట్రాన్స్‌కోకు నెలనెలా కొంత మేర విద్యుత్తును విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

రోజు రోజుకు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిత్యం ప్రయోగాలు చేస్తున్న సమీర సంస్థ పర్యావరణ పరిరక్షణకు పర్యాయ పదంగా నిలుస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. 

Tags:    

Similar News