నగరిలో సంక్రాంతి సంబరాలు.. ఎమ్మెల్యే రోజా సందడి

చిత్తూరు జిల్లా నగరిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించారు.

Update: 2020-01-12 07:55 GMT

చిత్తూరు జిల్లా నగరిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించారు. ఉదయం నుంచే ఆమె సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే ఎడ్లబండిని తోలుతూ సందడి చేశారు.

సంబరాలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వచ్చారు. రోజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సంక్రాంతి పండగ మరచిపోలేనిదని అన్నారు. ప్రజలు జగన్ పరిపాలనతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు రాజధాని విషయంపై కూడా ఆమె మాట్లాడారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలంతా హర్షిస్తున్నారని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని రాజధాని తరిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు.. ఆయన కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అని వ్యాఖ్యానించారు. గతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్నారని.. ఇవ్వని వారి పంటలను తగలబెట్టారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు సుజనా, సీఎం రమేష్‌కు వైసీపీని విమర్శించే అర్హత లేదని అన్నారు. వారు స్వలాభం కోసమే బీజేపీలో చేరారని అన్నారామె.  

Tags:    

Similar News