Vangalapudi Anitha: గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తాం

Vangalapudi Anitha: గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం అయింది.

Update: 2024-07-04 11:00 GMT

Vangalapudi Anitha: గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తాం

Vangalapudi Anitha: గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం అయింది. సమావేశంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయి సాగు చేయిస్తున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు గంజాయిపై చర్యలు తీసుకునేందుకు SEBకి అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు మంత్రి అనిత.

గంజాయి సరఫరాకి అమాయక గిరిజనులను బలిచేస్తున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గతంలో 16 రకాల పంటలు పండించేవారన్నారు. గత ఐదేళ్లుగా ITDA పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దాని కారణంగా డబ్బు కోసం గంజాయి అమ్ముతూ గిరిజనులు పట్టుబడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గంజాయి సాగు చేయవద్దని మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News