యనమలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

Update: 2020-02-11 15:07 GMT

అసెంబ్లీ కార్యదర్శిని వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యా‌ఖ్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. యనమల ఆరోపణలు కరెక్టు కాదని చెప్పారు. సెలెక్ట్ కమిటీలను భయపడే వాళ్లం కాదని వ్యాఖ్యానించారు. యనమలకు ఇంకా తాము అధికారంలో భ్రమలో ఉన్నారని, అందుకే అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై శాసమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లును మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీలకు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చైర్మన్ షరీఫ్ తీసుకున్న తీసుకున్న నిర్ణయాలు చెల్లవని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. చైర్మన్ గా తన విచక్షణాధికారం ఉందని షరీఫ్ మాట్లాడుతున్నారని, మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాలు కోర్టు ప్రశ్నించే అధికారం లేదని షరీఫ్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

మండలి చైర్మన్ విచక్షణాధికారాలను ఉపయోగించేందుకు సందర్భం ఉంటాయి, బిల్లులకు సంబంధించి సందిగ్ధం కొనసాగుతున్నప్పుడు చైర్మన్ విచక్షణాధికారాలు వాడలని, ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి కాదన్నారు. దీంతో చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లవని అన్నారు. వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి ఓటింగ్ నిర్వహించకుండానే, సెలెక్ట్ కమిటీలకు పంపడం సరైన నిర్ణయం కాదన్నారు.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని రామృష్ణుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారని నిలదీశారు. టీడీపీకి యనమల సలహాలు ఇవ్వడం వల్లే ఆ పార్టీ బోర్ల పడిందని విమర్శించారు.  

Tags:    

Similar News