ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి

మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు బకాయిలు తక్షణం చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనంజయ్ అన్నారు.

Update: 2019-11-26 08:34 GMT
గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనంజయ్ మరియు కూలీలు

చింతపల్లి: మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు బకాయిలు తక్షణం చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనంజయ్ అన్నారు.తాజంగి పంచాయతీ బాసంగి కొత్తూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలకు అందుతున్న బకాయిలు, బకాయిలు అందక ఇబ్బంది పడుతున్న కూలీలతో ఆయన మాట్లాడారు. కూలీలకు ఎక్కువ మొత్తంలో ఉపాధిహామీ బకాయి ఉందని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు.

2017-18 ఏడాదికి సంబంధించి సిల్వర్ ఓక్, గోతుల నిధులకు సంబంధించి 40 మంది రైతులకు అందవలసిన 40 వేల రూపాయల బకాయి ఉందన్నారు. అదేవిధంగా 2018-19 సంబంధించి కాఫీ మొక్కల బకాయి 25 వేల రూపాయలు, అలాగే ఇంకుడు గుంతలకు సంబంధించి 8 మంది లబ్ధిదారులకు 7 వేల రూపాయలు చొప్పున 56 వేల రూపాయలు వరకు అందవలసి ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Tags:    

Similar News