మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు

Update: 2019-11-21 14:27 GMT
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. సోనియాగాంధీ కిరణ్‌ కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గత కొంత కాలంగా హైదరాబాద్‌, బెంగళూర్‌కే పరిమితమైన ఆయన తిరుపతి రావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌చాందీ కిరణ్‌ పేరును ప్రతిపాదించారని తెలుస్తోంది.




Tags:    

Similar News